దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ సీటు ఎవరికి? | Manohar Joshi left sulking after Uddhav hints at fielding fresh face from South Central Mumbai | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ సీటు ఎవరికి?

Published Wed, Sep 25 2013 5:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

Manohar Joshi left sulking after Uddhav hints at fielding fresh face from South Central Mumbai

సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించనున్నట్టు వచ్చిన వార్తలు శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీని తీవ్ర అసంతృప్తికి లోనుచేశాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇదే సమయంలో రాహుల్ శెవాలే కు సంబంధించిన బ్యానర్లు దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఈ వార్తలను మరింత బలపరిచాయి. ఈ విషయమై మనోహర్ జోషీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.  దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మనోహర్ జోషీని బరిలోకి దింపే అంశంపై మూడు నెలలుగా పార్టీలో చర్చలు జరిగాయి. ఆ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపడం ఖాయమని అంతా భావించారు. అయితే ఠాణే లోక్‌సభ నియోజక వర్గం నుంచి మనోహర్‌ను బరిలోకి దింపే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వచ్చాయి.
 
 ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ మధ్య ముంబై నుంచి రాహుల్‌ను బరిలోకి దింపనున్నారనే వార్తలు రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ అంశంపై మనోహర్‌తో చర్చలు జరిపేందుకు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సిద్ధమైనట్టు తెలిసింది. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ అంశం మున్ముందు వివాదాస్పదంగా మారే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉందని, అందువల్ల దీనిని తమకు కేటాయించాలంటూ ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే కూడా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సీటు కేటాయింపు శివసేనకు తలనొప్పిగా పరిణమించే అవకాశం కూడా లేకపోలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement