
గిరిజన బాలికపై అత్యాచారం
సాక్షి, ముంబై: తల్లిదండ్రులు ఓటు వేయడానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ గిరిజన బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం జరిపాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ధులే జిల్లా, శిర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ప్రేమ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఎనిమిదేళ్ల కూతురును ఇంట్లో ఉంచి ఓటు వేయడానికి వెళ్లారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి బాలికను బలవంతంగా బయటకు తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆపై ఆమెను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు తీవ్ర గాయాలతో బాలిక బయటపడింది. భాదితురాలు ధులే జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.