
భయపడితే అవకాశాలు కోల్పోతారు
- విద్యార్థులకు రాహుల్ ద్రావిడ్ ఉద్బోధ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జీవితంలో వైఫల్యాలు ఎదురైనప్పుడు భయంతో కుంగిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఉద్బోధించారు. నగరంలోని గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూలులో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు.
వైఫల్యాలకు భయపడితే రిస్క్ తీసుకునే ధైర్యం చేయలేరని, తద్వారా అవకాశాలు సన్నగిల్లుతాయని తెలిపారు. గ్రీన్‌వుడ్ హై విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు. అనంతరం ద్రావిడ్ విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌లిచ్చారు. స్కూలు క్రికెట్ జట్టు ఆటగాళ్లతో రెండు ఓవర్లు ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ద్రావిడ్‌ను చుట్టుముట్టారు. ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.