
శివాజీనగర(బెంగళూరు): సాధారణంగా పరీక్ష ఫలితాలు నెల, రెండు నెలలు ఆలస్యం కావడం చూశాము, అయితే ఏకంగా పదేళ్ల క్రితం రాసిన డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించి బెంగళూరు విశ్వవిద్యాలయం ఒక అరుదైన ఘనతను సాధించింది. వివరాలు...2013లో 110 మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ పరీక్షలు రాశారు. ఈ విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి.
దీంతో అప్పటి నుంచి ఫలితాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సిండికేట్ సభ్యుడు టీవీ రాజు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. వారి నివేదిక ఆధారంగా గత పరీక్షల్లో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా ఫలితాలను మంగళవారం ప్రకటించనున్నారు.
చదవండి మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు