రాత్రి 7 గంటలు దాటితే అమ్మాయిలపై నిషేధం
ముంబై: ముంబైలోని కొన్ని కాలేజీలు విద్యార్థులు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించాయి. ఫ్యాషన్ కోసం కత్తిరించుకున్న జీన్స్, స్లీవ్‌లెస్ క్లాత్స్, షార్ట్స్ వేసుకుని అమ్మాయిలు/అబ్బాయిలు కాలేజీ క్యాంపస్‌లోకి రాకూడదని నిబంధనలు పెట్టాయి. కాలేజీ ఎంట్రన్స్ వద్ద ఈ మేరకు నోటీసులు అతికించాయి.
సెయింట్ జేవియర్ కాలేజీ, విల్సన్ కాలేజీ తదితర కాలేజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా కాలేజీ యాజమాన్యాలు దుస్తులపై ఆంక్షలు విధించడంపై విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకుని సెయింట్ జేవియర్ కాలేజీకి వెళ్లిన ఓ స్టూడెంట్‌ను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొన్ని కాలేజీల్లో అమ్మాయిలకు సమయం నిబంధన కూడా విధించారు. రాత్రి ఏడు గంటల తర్వాత అమ్మాయిలు కాలేజీ క్యాంపస్‌లో ఉండరాదని ఆంక్షలు పెట్టారు. క్యాంపస్‌లోని లైబ్రరీ లేదా ల్యాబ్‌లలో ఎక్కడా అమ్మాయిలు ఉండరాదని సూచించారు.