బస్సులపై రాళ్ల దాడులు | Rock attacks on buses | Sakshi
Sakshi News home page

బస్సులపై రాళ్ల దాడులు

Published Thu, Nov 24 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

Rock attacks on buses

24 బస్సులు ధ్వంసం
నలుగురికి తీవ్ర గాయాలు
వరుస దాడులతో అలజడి

తిరువళ్లూరు: అర్ధరాత్రి అకతారుులు ప్రభుత్వ, ప్రరుువేటు ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో ఐదు ప్రభుత్వ బస్సులు సహా 24 బస్సుల అద్దాలు ద్వంపమయ్యారుు. ఒకే రాత్రి 24 బస్సులపై దాడి జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించగా దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  శ్రీపెరంబదూరు నుంచి  తిరువళ్లూరు వైపు అర్ధరాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న మినీ వ్యాన్‌పై ద్విచక్ర వాహనంలో వెళ్లినన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి అద్దాలు ద్వంశం చేశారు. అధేవిధంగా శ్రీపెరందబూరు సమీపంలోనీ క్రాస్‌రోడ్డు,సెంగాడు, ఎగువనల్లాటూరుతో పాటు పలు ప్రాంతా ల్లో  గుర్తు తెలియనీ వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించడంతో దాదాపు పది బస్సులు ద్వంసమయ్యాయరుు.

దీంతో పాటు తిరువళ్లూరు నుంచి పూందమల్లి వైపు వెళుతున్న తిరుపతి-చెన్నై మార్గంలో నడిచే 201 బస్సుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించడంతో ఐదు బస్సులు ద్వంశమయ్యారుు. అరణ్‌వాయల్, మనవాలనగర్, నేమం వద్ద దాడులకు ఒడిగట్టారు. ఇదే విధంగా  కాకలూరు. తొయ్యూర్, వేపంబట్టు వద్ద కూడా గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై దాడులు చేసి అద్దాలు ద్వంసం చేశారు. ఈ సంఘటనలో  ప్రరుువేటు బస్సు డ్రైవర్ మునివేల్ సహ పలువురు గాయపడ్డారు. అర్ధరాత్రి  బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దాడి చేయడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

దాడులు వారి పనేనా: అరుుతే దాడులు చేసిన వ్యక్తులు ఎవరై  ఉంటారన్న దానిపై గుమ్మతుగా విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదానికి నాగరాజు వ్యతిరేఖంగా  మాట్లాడిన హిందూ ఐక్యవేదిక నేతలు మంగళవారం భారీ నిరాహరదీక్ష చేపట్టారు. ఈ నిరాహరదీక్షలో మాట్లాడిన పలువురు ఒక వర్గంలోని యువకులు జీహాద్  పేరిట ఉగ్రవాదులుగా మారుతున్నారనని ఆరోపణలు చేశారు. ఇకపై హిందువులపై దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హిందువుల నిరాహరదీక్ష, ముస్లింలపై మాట ల తూటాలతో ఆగ్రహించిన కొందరు మంగళవారం రాత్రి  బస్సులపై దాడులకు  దిగి వచ్చి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణనూ ముమ్మరం చేశారు.  పోలీసులు ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ శ్యామ్‌సన్ మీడియాకు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement