స్కూల్ కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ... | School student gangrarped in bangalore | Sakshi
Sakshi News home page

స్కూల్ కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ...

Published Thu, Aug 21 2014 8:34 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

స్కూల్ కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ... - Sakshi

స్కూల్ కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ...

బెంగళూరు : పాఠశాలకు వెళుతున్న బాలికను కిడ్నాప్ చేసి పలు మార్లు అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిని బెంగళూరు శివారులోని మాదనాయకనహళ్లి పోలీసులు బుదవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... మాదనాయకనహళ్లికి చెందిన బాలిక(14), స్థానిక పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. నాలుగు నెలల క్రితం బాలిక పాఠశాలకు వెళుతున్న సమయంలో ఇద్దరు ఆమెను కిడ్నాప్ చేసి, నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరిపారు. అనంతరం విషయాన్ని బయటకు చెబితే కుటుంబసభ్యులందరినీ హతమారుస్తామని బెదిరించి, వదిలేశారు.
 
 దీంతో ఈ విషయాన్ని బాలిక ఎవరికి చెప్పలేదు. మంగళవారం బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండడంతో నెలమంగలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తల్లిదండ్రులు పిలుచుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలిక గర్భవతి అని తేలింది.  తల్లిదండ్రులు ఆరాతీయగా జరిగిన దుశ్చర్యను బాలిక ఏకరువు పెట్టింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తెలిపిన ఆధారాల మేరకు కామాంధులను బుధవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement