చిన్నారుల భద్రతకు కర్ణాటకలో టాస్క్ఫోర్స్ | karnataka government forms task force for safety of children | Sakshi
Sakshi News home page

చిన్నారుల భద్రతకు కర్ణాటకలో టాస్క్ఫోర్స్

Published Fri, Nov 7 2014 3:53 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

karnataka government forms task force for safety of children

బెంగళూరు: పాఠశాలల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం మేలుకుంది. చిన్నారుల భద్రత కోసం 14 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.

కేంబ్రిడ్జి స్కూల్లో ఇటీవల ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. అంతకుముందు రెండు ప్రైవేటు పాఠశాలల్లో ఇలాంటి దారుణాలు వెలుగుచూశాయి. చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోవడంతో బెంగళూరు వాసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పసిమొగ్గలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేశారు. ప్రజాగ్రహంతో  దిగివచ్చిన ప్రభుత్వం- చిన్నారుల భద్రత కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement