- లోపించిన పారిశుధ్యం..విజృంభిస్తున్న దోమలు..
- వెదజల్లుతున్న దుర్వాసన
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- ఆందోళనలో గ్రామస్తులు
ఉట్నూర్ రూరల్‌ః మండలంలోని హస్నాపూర్ గ్రామంలో పారి శుద్యం లోపించి అధ్వానంగా మారింది. అదేదో మారుమూల గ్రామం కాదు ఆదిలాబాద్ - ఆసిఫాబాద్ ప్రధాన రహాదారికి ఈ గ్రామం ఆనుకొని ఉంది. గత కొన్ని రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షానికి మురికి కాలువల్లో పూడిక నిండి ఉండటంతో గ్రామంలో నీరు ఎక్కడిక్కడ నిలిచి దోమల విజృభనకు స్థావరంగా మారుతున్నాయి.
జిల్లా ఉన్నతధికారులు పారిశుద్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశా లు ఇస్తున్న ఇక్కడి అధికారులకు ఆదేశాలు వర్తించవేమోనని ఈ గ్రామ పరి స్థితిని చూస్తే అనిపిస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసిన పా రిశుద్యం లోపించి అ ధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రధాన రహా దారి పక్కన బురదతో ఉంది. ఈ రహా దారిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు ప్రయాణిస్తుంటారు.. కాని ఈ పరిస్థితి పట్టించుకునే నాథులు కానరావడం లేదు. గ్రామంలో ఉన్న ఇండ్ల చుట్టూ వరద నీరు చేరి బురదమయంగా మారింది. మురికికాలువలు లేక మురికి నీరు ఎక్కడిక్కడ నిలిచి దర్శనమిస్తోంది.
పనిచేయని నీటి మోటారు..
గ్రామానికి నీటి సరఫరా చేసే మంచి నీటి మోటారు చెడి పోయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ మరమ్మత్తులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మోటారు దాదాపు 50 కుటుంబాలకు నీటిని అందిస్తుంది. గ్రామస్తులు ఉపయోగించే బావి ఇది వరకు ఒకే సారి క్లోరినేషన్ చేపట్టారని, వర్షానాకి నీళ్లు మురికిగా అయ్యాయని క్లోరినేషన్ చేపట్టాలని కోరుతున్నారు. పట్టించుకునే వారు లేకుండా పోయారు.
అధ్వానంగా రోడ్లు..
గ్రామంలో ఉన్న సీసీ రోడ్లపై పక్కలకు మట్టి చేరి నీరు రోడ్డుపైనే ఆగుతున్నాయి. దీంతో గ్రా మంలో రోడ్డు ఉండి నడవటానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు లేని ప్రాం తాల్లో బురదమంగా మారింది. ప్రధాన రోడ్డుకు ఇరువైపుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక గ్రామ రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైన మట్టి తీసి రోడ్లు శుభ్రపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇళ్ల చుట్టూ అపరిశుభ్రతే..
వర్షపు నీరు చేరి గ్రామంలో పలు ఇండ్ల చుట్టు మురికి నీరు నిలిచి అధ్వానంగా మారాయి. సీసీ రోడ్లు పగుళ్లు తేలాయి. మురికి కాలువల్లో పూడిక నిండి కాలువ జాడ లేకుండా పోయింది. దీంతో వరద నీరు ఇండ్లలో చేరుతుంది. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారులకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నారు.
మోటారు మరమ్మతు చేయించాలి
నీటి కోసం గోస అయితాంది. తమకు నీరు అందించే మోటారు నాలుగు నెలల క్రితం పాడైపోయింది. బాగు చేయిస్తామని తీసుకువెళ్లి నాలుగు నెలలు గడుస్తున్న ఇంత వరకు తీసుకువచ్చి బిగించలేదు.
- ఉషాబాయి, గ్రామస్తురాలు
రోడ్లు మంజూరు చేయాలి
గ్రామంలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. చినుకు పడితే రోడ్డు చిత్తడిగా మారుతోంది. దీంతో నడవటానికి సైతం ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఏర్పాటు చేసి చుట్టు పక్కల మురికి కాలువలు ఏర్పాటు చేసి తమసమస్యలు పరిష్కరించాలి.
- షేక్ జిలాని, గ్రామస్తుడు
అధికారులు స్పందించాలి..
రోడ్లన్ని పగుళ్లు తేలాయి. మురికి కాలువలు పూడికతో నిండి పోయాయి. ఎన్నో సార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించాం. చేద్దాం, చూద్దాం అనటమే తప్ప నేటికి తమ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి.
- రాథోడ్ లాల్‌సింగ్, గ్రామస్తుడు
రోడ్లు ఏర్పాటు చేయాలి..
సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం చినుకు పడితే రోడ్డు చిత్తడిగా తయారు అయితంది. నడువడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు రోడ్లు, మురికి కాలువలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించాలి.
- దేవుకాబాయి, గ్రామస్తురాలు