ప్రమాణ స్వీకారం.. | Standard new MLAs. | Sakshi
Sakshi News home page

ప్రమాణ స్వీకారం..

Published Wed, Nov 30 2016 3:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

Standard new MLAs.

►  కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం
►  మంత్రుల శుభాకాంక్షలు

 
 సాక్షి, చెన్నై: కొత్త ఎమ్మెల్యేలు ముగ్గురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేరుుంచా రు. కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.    తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరి నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి నెల్లితోపులో ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి విజయం సాధించారు. ఫలితాల మరుసటి రోజే ఆయ న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులు తిరుప్పర గుండ్రంలో ఏకే బోసు, అరవకురిచ్చిలో మా జీ మంత్రి సెంథిల్ బాలాజీ, తంజావూరులో రంగస్వామి విజయ ఢంకా మోగించారు. ఎమ్మెల్యేలుగా గెలిచినానంతరం ధ్రువీకరణ పత్రాలతో అపోలో ఆసుపత్రికి చేరుకున్న ఈ ముగ్గురు అక్కడ చికిత్స పొందుతున్న తమ అమ్మ జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నా రు. అమ్మ దర్శనం లభించకున్నా, ఆశీస్సులు దక్కినట్టే భావించి వెలుపలకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇక, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి వారం రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు మంగళవారం ప్రమాణ స్వీకారానికి చర్యలు తీసుకోవడంతో అసెంబ్లీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం కొత్త ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ స్పీకర్ ధనపాల్ కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేరుుంచారు. తొలుత సెంథిల్ బాలాజీ, తదుపరి రంగస్వామి, చివరగా ఏకే బోసు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురికి ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, పి.తంగమణి, ఎస్‌పి.వేలుమణి, డి జయకుమార్, సెల్లూరు కే రాజులతో పాటు మరి కొందరు మంత్రులు,  డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement