Criteria
-
అదొక్కటే ప్రమాణం కాదు! డీలిమిటేషన్‌పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఈ డీలిమిటేషన్ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు. కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్ జిల్లాను సోనిత్‌పూర్‌లో, హోజాయ్ను నాగావ్‌లో, తముల్పూర్ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
ప్రమాణ స్వీకారం..
► కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం ► మంత్రుల శుభాకాంక్షలు సాక్షి, చెన్నై: కొత్త ఎమ్మెల్యేలు ముగ్గురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేరుుంచా రు. కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరి నెల్లితోపు అసెంబ్లీ స్థానాలకు 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి నెల్లితోపులో ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి విజయం సాధించారు. ఫలితాల మరుసటి రోజే ఆయ న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులు తిరుప్పర గుండ్రంలో ఏకే బోసు, అరవకురిచ్చిలో మా జీ మంత్రి సెంథిల్ బాలాజీ, తంజావూరులో రంగస్వామి విజయ ఢంకా మోగించారు. ఎమ్మెల్యేలుగా గెలిచినానంతరం ధ్రువీకరణ పత్రాలతో అపోలో ఆసుపత్రికి చేరుకున్న ఈ ముగ్గురు అక్కడ చికిత్స పొందుతున్న తమ అమ్మ జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నా రు. అమ్మ దర్శనం లభించకున్నా, ఆశీస్సులు దక్కినట్టే భావించి వెలుపలకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి వారం రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు మంగళవారం ప్రమాణ స్వీకారానికి చర్యలు తీసుకోవడంతో అసెంబ్లీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం కొత్త ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ స్పీకర్ ధనపాల్ కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేరుుంచారు. తొలుత సెంథిల్ బాలాజీ, తదుపరి రంగస్వామి, చివరగా ఏకే బోసు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురికి ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, పి.తంగమణి, ఎస్పి.వేలుమణి, డి జయకుమార్, సెల్లూరు కే రాజులతో పాటు మరి కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఉలికిపాటు !
- వినుకొండలో కూలిన నాలుగు అంతస్తుల భవనం - ప్రమాణాలు పాటించకపోవటమే లోపం - గుంటూరులో 30కు పైగా శిథిలావస్థకు చేరిన భవనాలు - కూలే దశలో పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్ అరండల్‌పేట (గుంటూరు): వినుకొండ కుమ్మరిబజారులో పిల్లర్లు లేకుండా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం పాత గుంటూరులో భవనం నిర్మిస్తున్న సమయంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు. మారుతీనగర్‌లో ఓ ఇంటి నిర్మాణ సమయంలోనే పూర్తిగా కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. తాజాగా వినుకొండలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పాటు అను భవం లేని ఇంజినీర్లు భవనాలు నిర్మిస్తుండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, గుంటూరులో సాక్షాత్తూ నగరపాలక సంస్థకు చెందిన పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్లు కూలే దశలో ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శిథిలావస్థకు చేరిన 30 భవనాలు ... గుంటూరులో శిథిలావస్థకు చేరిన భవనాలు 30కు పైగా ఉన్నాయి. ప్రధానంగా లాలాపేట, గుంటూరువారితోట, పట్నం బజారు, పాతగుంటూరు, మారుతీనగర్, తదితర ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రణాళికాధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటితే ఒకసారి అధికారులు వాటిని పరిశీలించాలి. వందేళ్లు దాటిన భవనాలకు మాత్రం నోటీసులు జారీచేసి వాటిని కూల్చివేయాలి. గుంటూరులో ఇటీవల భవన నిర్మాణాలు అధికమయ్యాయి. ప్రతి నెలా 60కు పైగా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేవలం ప్లాను మంజూరు చేయడంతోనే తమ పనిపూర్తయిందని భావిస్తున్నారు. ఆ భవన నిర్మాణం ఎలా జరుగుతోంది. ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా,ఇంజినీరు శక్తిసామర్థ్యాలు, బిల్డర్ తీసుకుంటున్న జాగ్రత్తలు, పక్కనే ఉన్న భవనాలకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా.. ప్లానుకు అనుగుణంగా పని జరుగుతుందా లేదా ఇలాంటి అంశాలను సంబంధిత బిల్డింగ్ ఇన్స్పెక్టరు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఇవేమీ నగరంలో జరుగుతున్న దాఖలాలు లేవు. ఒక్కోసారి నిర్మాణాలు జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న భవన యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. జీఎంసీ భవనాలకూ దిక్కులేదు.. నగరంలో భవనాలను పర్యవేక్షించాల్సిన నగరపాలక సంస్థ తన సొంత భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ ఎదురుగా పీవీకే నాయుడు మార్కెట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో 44 దుకాణాలు ఉన్నాయి. శ్లాబ్ మొత్తం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి ప్రజలపై పడుతున్నాయి. కోర్టుసైతం కార్పొ రేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి పదిహేను రోజులకు పైగా అవుతున్నా కూల్చేందుకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా లాలాపేటలోని పండ్లమార్కెట్ ఇదే పరిస్థితి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం ... నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలపై చర్యలు తీసుకుంటాం. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం. పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్లను వెంటనే కూల్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - రవీందర్, ఏసీపీ. -
బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’
జెనీవా: బాసెల్ 3 ఫ్రేమ్‌వర్క్ నిబంధనలకన్నా... కొన్ని అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ నిబంధనలే చాలా కఠినమైనవని బాసెల్ కమిటీ (బ్యాంకింగ్ పర్యవేక్షణ) నివేదిక ఒకటి పేర్కొంది. ప్రపంచ వృద్ధే లక్ష్యంగా పలు దేశాల్లో బ్యాంకులకు తగిన మూలధనం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన విధివిధానాలను బాసెల్ 3 ప్రమాణాలు నిర్ధేశిస్తున్నాయి. 14 అంశాలను పరిగణనలోకి తీసుకున్న బాసెల్ కమిటీ, బాసెల్ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ బ్యాంకింగ్ ఉండగలదని వ్యాఖ్యానించింది. భారత్, దక్షిణాఫ్రికాలో బాసెల్ 3 అమలుపై ఈ మేరకు ఒక నివేదికను కమిటీ ఆవిష్కరించింది. భారత్ తరహాలోనే దక్షిణాఫ్రికా బ్యాంకింగ్ విధానం ఉందని పేర్కొంది. బాసెల్ 3 గ్లోబల్ క్యాపిటల్ నిబంధనల అమలుకు గడువును 2014 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 మార్చికి పొడిగించింది. 2016 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బ్యాంకులకు తాజా పెట్టుబడులుగా రూ.7,900 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని సూచించింది.