బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’ | Indian banks 'strengthened' | Sakshi
Sakshi News home page

బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’

Published Tue, Jun 16 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’

బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’

జెనీవా: బాసెల్ 3 ఫ్రేమ్‌వర్క్ నిబంధనలకన్నా... కొన్ని అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ నిబంధనలే చాలా కఠినమైనవని బాసెల్ కమిటీ  (బ్యాంకింగ్ పర్యవేక్షణ) నివేదిక ఒకటి పేర్కొంది. ప్రపంచ వృద్ధే లక్ష్యంగా పలు దేశాల్లో బ్యాంకులకు తగిన మూలధనం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన విధివిధానాలను బాసెల్ 3 ప్రమాణాలు నిర్ధేశిస్తున్నాయి. 14 అంశాలను పరిగణనలోకి తీసుకున్న బాసెల్ కమిటీ, బాసెల్ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ బ్యాంకింగ్ ఉండగలదని వ్యాఖ్యానించింది.

భారత్, దక్షిణాఫ్రికాలో బాసెల్ 3 అమలుపై ఈ మేరకు ఒక నివేదికను కమిటీ ఆవిష్కరించింది. భారత్ తరహాలోనే దక్షిణాఫ్రికా బ్యాంకింగ్ విధానం ఉందని పేర్కొంది.   బాసెల్ 3 గ్లోబల్ క్యాపిటల్ నిబంధనల అమలుకు గడువును 2014 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 మార్చికి పొడిగించింది. 2016 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బ్యాంకులకు తాజా పెట్టుబడులుగా రూ.7,900 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement