Indias banking
-
భారత్ బ్యాంకింగ్‌కు కష్టకాలమే!
బీఐఎస్ నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌కు రానున్నది కష్టకాలమేనని స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ– బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) విడుదల చేసిన ఒక వర్కింగ్ పేపర్ అభిప్రాయపడింది. ప్రత్యేకించిరుణ వృద్ధి సమయంలో బ్యాంకులకు మూలధనం విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. మూలధనం తగిన స్థాయిలో ఉన్న బ్యాంకుల విషయంలో మాత్రం ఇబ్బందులు కొంత తక్కువగాఉంటాయని తెలియజేసింది. ఇక ప్రైవేటు రంగం విషయంలో మొండిబకాయిల సమస్యను నివేదిక ప్రస్తావిస్తూ... వడ్డీరేట్ల మార్పుల సందర్భాల్లో ఆయా ప్రైవేటు బ్యాంక్ ద్రవ్య పరిస్థితులు ఒడిదుడుకుకు గురయ్యేవీలుందని అభిప్రాయపడింది. కాగా వర్కింగ్ పత్రాన్ని ఆర్బీఐకి చెందిన పల్లవి చవాన్, బీఐఎస్‌లో ఆర్థిక నిపుణులు లియోనార్డో సంయుక్తంగా రూపొందించారు. విశ్లేషణాపత్రంలోని అభిప్రాయాలు కేవలం వీరిగానేభావించాలని బాసిల్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ బ్యాంకింగ్ రెగ్యులేటర్– బీఐఎస్ వివరించింది. -
బాసెల్‌కన్నా...భారత్ బ్యాంకింగ్ ‘పటిష్టం’
జెనీవా: బాసెల్ 3 ఫ్రేమ్‌వర్క్ నిబంధనలకన్నా... కొన్ని అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ నిబంధనలే చాలా కఠినమైనవని బాసెల్ కమిటీ (బ్యాంకింగ్ పర్యవేక్షణ) నివేదిక ఒకటి పేర్కొంది. ప్రపంచ వృద్ధే లక్ష్యంగా పలు దేశాల్లో బ్యాంకులకు తగిన మూలధనం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన విధివిధానాలను బాసెల్ 3 ప్రమాణాలు నిర్ధేశిస్తున్నాయి. 14 అంశాలను పరిగణనలోకి తీసుకున్న బాసెల్ కమిటీ, బాసెల్ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ బ్యాంకింగ్ ఉండగలదని వ్యాఖ్యానించింది. భారత్, దక్షిణాఫ్రికాలో బాసెల్ 3 అమలుపై ఈ మేరకు ఒక నివేదికను కమిటీ ఆవిష్కరించింది. భారత్ తరహాలోనే దక్షిణాఫ్రికా బ్యాంకింగ్ విధానం ఉందని పేర్కొంది. బాసెల్ 3 గ్లోబల్ క్యాపిటల్ నిబంధనల అమలుకు గడువును 2014 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 మార్చికి పొడిగించింది. 2016 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బ్యాంకులకు తాజా పెట్టుబడులుగా రూ.7,900 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని సూచించింది.