తమిళ సినిమా, న్యూస్‌లైన్ : ఎయిటీస్ స్టార్స్ నైట్ పార్టీని దక్షిణాది ప్రముఖ తారలు జాయ్‌ఫుల్‌గా గడిపారు. వీరం తా ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1980లో కేరీర్‌ను ప్రారంభించిన తారలందరూ ఏడాదికో రోజును సమష్టిగా, సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జాయ్‌ఫుల్ డే ఐదేళ్ల క్రితమే ప్రారంభమైంది. 1980లో నటీనటులందరూ ఒక కుటుంబంలా ఒక చోట కలుసుకుని తమ అంతరంగాలను పంచుకుంటూ ఆహ్లాదంగా గడపడానికి చెన్నైని వేదికగా ఎంచుకున్నారు. దీనికి 80స్ ఫిలింస్టార్ గెట్ టు గెదర్ అనే పేరును పెట్టుకున్నారు.
ఈ ఏడాదికి గాను శనివారం రాత్రి చెన్నై ఇంజంబాక్కం ఈస్ట్‌కోస్ట్ లోని ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ గెస్ట్ హౌస్‌లో దక్షిణాది ప్రముఖ తారలు కలిసి ఎంజాయ్ చేశారు. వీరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మోహన్‌లాల్, జయరామ్, అంబరీష్, అర్జున్, సుమన్, రమేష్ అరవింద్, మోహన్, నరేష్, భాను చందర్, నటీమణులు సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, రేవతి, విజి ప్రియదర్శన్, సరిత, సుమలత, రాధిక, అంభిక, పూర్ణిమ భాగ్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే ప్రత్యేకంగా జరుపుకుంటున్న ఈ తారల గెట్‌టు గెదర్ కార్యక్రమానికి మూల కారణం నటి సుహాసిని, విజి ప్రియదర్శన్ నట. ఈ ఐడియా వారిదేనట. వీరు ఈ తరహా తారల పార్టీకి 2009లోనే శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నటుడు మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన ఈ విందు సందడికి నటి సుహాసిని బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పార్టీలో పాల్గొనడానికి ఎలాంటి సభ్యత్వం అవసరం లేదని ఈమె పేర్కొన్నారు.
ఈ పార్టీ కేవలం 80 కాలఘట్టంలోని తారలకే పరిమితం అన్నారు. అలాగే దర్శక, నిర్మాతలు లాంటి వారికి అనుమతి లేదని కూడా సుహాసిని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ విందులో పాల్గొన్న రజనీకాంత్, చిరంజీవిలతో సహా అందరు కలర్‌ఫుల్ దుస్తుల్లో పాల్గొనడం, గెట్ టు గెదర్ చివరి దశకు చేరుకున్న తరువాత మోహన్‌లాల్ అందరికీ అందమైన పెయింటింగ్‌లను బహుమతిగా అందించారు.
ఎయిటీస్ స్టార్‌స జాయ్‌ఫుల్ నైట్
Published Tue, Jan 21 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement