ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు | State govt fails to install simulators at RTOs | Sakshi
Sakshi News home page

ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు

Published Mon, Jan 12 2015 11:15 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు - Sakshi

ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు

సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కొన్ని ఆర్టీఓ కార్యాలయాలలో వీటిని అమర్చినప్పటికీ అవి పని చేయడం లేదు. కంప్యూటర్ స్క్రీన్‌పై శిక్షణనిచ్చే ఈ యంత్రాలను ఎన్నింటిని అమర్చాలో కూడా నిర్ణయించలేదు. రోడ్డుపై వాహనాన్ని సురక్షితంగా నడిపేందుకు గాను కంప్యూటర్ ప్రోగ్రామ్ మిషన్‌పై ఆర్టీఓ కార్యాలయాలలో ఈ శిక్షణ ఇస్తున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే సమయంలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించే పరికరాలు కూడా సక్రమంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఓ ఆర్టీఓ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అంధేరీ, తాడ్‌దేవ్ ఆర్టీఓలలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదిలా వుండగా అంధేరీలో ఉన్న ఈ యంత్రం గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు.

ఈ పరికరం ఎంతో ఖరీదైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పరికరాన్ని అమర్చడంలో జాప్యం చేస్తుందని మరో అధికారి చెప్పారు. అయితే ఈ డ్రైవింగ్ శిక్షణ యంత్రాలకు గాను ఒక్కోదానికి రూ.ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రస్తుతం బస్ డ్రైవింగ్ కోసం ఈ శిక్షణ యంత్రాలు వెస్టర్న్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ (డబ్ల్యూఐఏఏ) డ్రైవింగ్ సెంటర్ చర్చ్‌గేట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement