అందుకే అలా నటించాను | story demand Glamour role says mridula bhaskar | Sakshi
Sakshi News home page

అందుకే అలా నటించాను

Published Tue, Mar 31 2015 8:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

అందుకే అలా నటించాను

అందుకే అలా నటించాను

 కథ డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించాల్సి వచ్చిందని అంటున్నారు నటి మృదుల భాస్కర్. రాంగోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం ఐస్ క్రీం-2లో నటించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే వల్లినం, తిలగర్ చిత్రాల్లో నటించిన మృదుల కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. త్వరలో మరుమునై చిత్రంతో తెరపైకి రానున్నారు. కోలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నాయని, అన్నీ ఒకే రకం పాత్రలు కావడంతో అంగీకరించడం లేదని అంటున్నారు.
 
 ఒక్క పాత్ర చేసినా ప్రజలకు దగ్గర కావాలనే భావిస్తానని, దానికనుగుణంగా పాత్రలు ఎంపిక చేసుకుంటున్నానని చెబుతున్నారు. ఐస్ క్రీం-2 చిత్రంలో గ్లామర్‌గా నటించడాన్ని ప్రశంసిస్తున్నారని, ఆ చిత్ర కథ డిమాండ్ మేరకు ఆ విధంగా నటించాల్సి వచ్చిందని వివరించారు. ఇకపై అంత గ్లామర్‌గా నటించే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో న్యాయశాస్త్రం నాలుగో సంవత్సరం చదువుతున్నానని, నృత్యంపై ఆసక్తి కారణంగా డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నానని తెలిపారు. స్కూల్‌కు సమయం కేటాయించడం వల్ల నటనకు గ్యాప్ వస్తోందని, ఇకపై అలా కాకుండా చూసుకుంటానని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement