వేలం పాటకు రెడీ | Ram Gopal Varma takes auction route for movie distribution | Sakshi
Sakshi News home page

వేలం పాటకు రెడీ

Published Wed, Sep 10 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

వేలం పాటకు రెడీ

వేలం పాటకు రెడీ

‘‘ఈ సినిమా మొత్తం అవుడ్డోర్‌లోనే తీశాం. రెండు గ్రూప్‌లు ఒక చోటకు వెళ్లినపుడు అక్కడేం జరిగింది? వాళ్లనెవరు చంపారన్నది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ‘అనుక్షణం’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా వేలం పాట పద్ధతిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఆయన దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రం ప్రచార చిత్రాన్ని, పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘పేరుకే ఇది ఐస్‌క్రీమ్. కానీ చాలా వేడివేడిగా ఉంటుంది. వర్మతో వెంట వెంటనే రెండు సినిమాలు నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు జేడీ చక్రవర్తి, దర్శ కులు వీరశంకర్, మారుతి, కథానాయిక నవీన తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement