‘ఐస్‌క్రీమ్-2’ ఆడియో ఆవిష్కరణ | 'Ice Cream -2' Audio Launch | Sakshi
Sakshi News home page

‘ఐస్‌క్రీమ్-2’ ఆడియో ఆవిష్కరణ

Published Mon, Sep 22 2014 2:29 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

‘ఐస్‌క్రీమ్-2’ ఆడియో ఆవిష్కరణ - Sakshi

‘ఐస్‌క్రీమ్-2’ ఆడియో ఆవిష్కరణ

మంగళగిరి రూరల్ : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమైన ఐస్‌క్రీమ్-2 చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి గుంటూరు జిల్లాలో వేడుకగా జరిగింది. మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగించుకుని సినీరంగంలో రాణించాలని యువతకు సూచించారు.  

విజయవాడ వీధుల్లో తిరుగుతూ సినిమారంగంపై ఆసక్తి పెంచుకున్న తాను పట్టుదలతో ఇంతటి స్థాయికి ఎదిగానని చెప్పారు. తాను దేవుడిని నమ్మనని, ఎవరినీ లెక్క చేయనని తెలిపారు. మనస్సుకు నచ్చిన పనిని ఇష్టంగా చేసుకుంటూ పోతానన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని యువకులు దర్శకులుగా రాణించాలని  కోరారు.

కార్యక్రమంలో సినీ నిర్మాత రామసత్యనారాయణ, అంబికా కృష్ణ, హీరో జేడీ చక్రవర్తి, హీరోయిన్ నవీనా, క్యారెక్టర్ ఆరిస్టులు ధనరాజ్, భూపాల్, షాలిని, డాక్టర్ సూర్యారావు, కృష్ణార్జునరావు,  తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్, పాటలను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement