ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్ : రాష్ట్రంలో వడ దెబ్బ మరణాల సంఖ్య రోజురోజుకు పుంజుకుంటోంది. గత వారం రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది వేసవి కాలంలో గడిచిన 2 నెలల వ్యవధిలో 42 వడ దెబ్బ మరణాలు సంభవించాయి. గడిచిన 8 రోజుల్లో 7 వడ దెబ్బ మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు రెండు నెలల్లో 35 మరణాలు నమోదైనట్లు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది రుతు పవనాలు రాష్ట్రాన్ని ముందస్తుగా తాకి అకస్మాత్తుగా కనుమరుగు కావడంతో వేసవి తీవ్రత పునరావృతం అయింది. ఈ పునరావృతంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ వ్యవధిలో వడ దెబ్బ మృత్యు సంఘటనలు వేగంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు కలవరపడుతున్నాయి.
లోగడ అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పలు చోట్ల 35 వడ దెబ్బ మృత్యు సంఘటనలు సంభవించాయి. వీటిలో 7 మరణాలు ఖరారైనట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ విష్ణు పద శెట్టి బుధవారం ప్రకటించారు. వడ దెబ్బ మృత్యు సంఘటనల్లో పోస్ట్‌మార్టం అనివార్యం. ఈ నివేదికలు అందితే తప్ప నమోదైన వడదెబ్బ మృతుల్ని అధికారికంగా ధ్రువీకరించలేమని ఆయన వివరించారు. ఇతర మృతుల నివేదిక అందితే వాస్తవ వడదెబ్బ మరణాలు ఖరారవుతాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ప్రభావంతో ఇటీవల 7 వడ దెబ్బ మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఒకే రోజున 6 వడదెబ్బ మరణాలు
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం 6గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మరణించారు. భద్రక్ జిల్లాలోని ఒగొరొపొడా గ్రామంలో ఒకరు మరణించగా గంజాం జిల్లా భంజనగర్, పాత్రపూర్ ప్రాంతాల్లో ఇద్దరు, కేంద్రపడ జిల్లాలో ఇద్దరు, బాలేశ్వర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మంగళవారం నాటి వడదెబ్బ మృతులు 6గా నమోదు కావడం కలవర పరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment