
వెంకయ్యకు ఆత్మగౌరవం ఉంటే...
గుంటూరు : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి ఆత్మగౌరవం ఉంటే పార్టీకి, పదవికీ రాజీనామా చేసి ఏపీ కోసం పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ప్రభుత్వ హామీయే కాని పార్టీది కాదని ఆయన స్పష్టం చేశారు.
వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా... మోదీ నుంచి ప్రత్యేక హోదా సాధించలేరని సురవరం సుధాకర్రెడ్డి చెప్పారు.