సీఎం, మంత్రులు జీ పరమేశ్వర్,
జార్జ్ పదవులనుంచి తప్పుకోవాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభా కరంద్లాజే
మైసూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్,పోలీసు అధికారులను మానసికంగా వేధిస్తూ వారి రాజీనామాలకు, ఆత్మహత్యలకు కారణమవుతూ అరాచక పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభా కరంద్లాజే ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం ఆమె మైసూరులో మీడియాతో మాట్లాడారు. అధికారుల రాజీనామాలు, ఆత్మహత్యలకు బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,హోంశాఖ మంత్రి జీ.పరమేశ్వర్,నగరాభివృద్ధి శాఖమంత్రి కే.జే.జార్జ్‌లు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా మైసూరుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాష్ట్రంలో జరుగుతన్న పరిణామాల గురించి వివరించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికాలకు ఐఏఎస్,పోలీసు అధికారులు రాష్ట్రంలో పని చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి జరుగలేదన్నారు.
సుమారు 1,200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శంచారు. గత సంవ త్సరం ఆత్మహత్యకు పాల్పడ్డ ఐఏఎస్ అధికారి డీ.కే.రవి ఆత్మహత్య కేసుతో పాటు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసులోను మంత్రి కే.జే.జార్జ్ భాధ్యుడని స్పష్టంగా ఆధారాలున్నా కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి కే.జే.జార్జ్‌ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించట్లేదని విమర్శించారు.డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు అహోరాత్రి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.కార్యక్రమంలో ఎంపీ ప్రతాపసింహ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ది అరాచక పాలన
Published Sat, Jul 16 2016 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement