మోదం....ఖేదం
- గట్టిగా కూత పెట్టని ఖర్గే రైలు
- భారీ వరాలు కురిపించని బడ్జెట్
- పరిమితుల్లోనే ఉదార స్వభావాన్ని చూపిన ఖర్గే
- రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లు
- నాలుగు నూతన లైన్లకు సర్వే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున ఖర్గే బుధవారం లోక్‌సభలో 2014-15 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పెద్దగా వరాలు కురిపించలేక పోయింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను మాత్రమే ప్రవేశ పెడతానని ఆయన ముందుగానే ప్రకటించారు. అయినా తనకు మొదటిది, చివరిది అయిన ఈ బడ్జెట్‌లో రాష్ర్టంపై వరాలు కురిపించకపోతారా అని అందరూ ఆశాభావంతో ఉన్నారు.
అయితే మధ్యంతర బడ్జెట్ కనుక తనకున్న పరిమితుల్లో ఆయన కొంత మేరకే ఉదార స్వభాన్ని ప్రదర్శించగలిగారు. ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించారు. నాలుగు కొత్త లైన్లకు సర్వేను ప్రతిపాదించారు. మూడు రైళ్ల రాకపోకల రోజులను పెంచారు. ప్రసుత్తం అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో నాలుగింటికి నిధులు కేటాయించారు. వీటిలో కడూరు-చిక్కబళ్లాపురం (85 కి.మీ) గేజ్ మార్పిడి, కడూరు-చిక్కమగళూరు (46 కి.మీ) కొత్త లైను, మద్దూరు-మండ్య (19 కి.మీ), బిరూరు-అజ్జంపూర్ (18 కి.మీ) డబ్లింగ్ పనులు ఉన్నాయి.
కొత్త రైళ్లు
1. యశ్వంతపుర-జైపూర్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా గుల్బర్గ
2.యశ్వంతపుర-కత్రా వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా గుల్బర్గ, కాచిగూడ
3. తిరువనంతపురం-బెంగళూరు (యశ్వంతపుర). వారానికి రెండు సార్లు
4. బెంగళూరు సిటీ-చెన్నై. డెయిలీ ఎక్స్‌ప్రెస్ వయా బంగారుపేట, జోలార్ పేట
5. హౌరా-యశ్వంతపుర ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా భువనేశ్వర్, గూడూరు, కాట్పాడి
6. హుబ్లీ-ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా బిజాపుర
7. వారణాసి-మైసూరు ఎక్స్‌ప్రెస్. వారానికి రెండు సార్లు
8. హుబ్లీ-బెల్గాం డెయిలీ ఫాస్ట్ ప్యాసింజర్
రాకపోకల పెంపు
1. బీదర్-యశ్వంతపుర. వారానికి మూడు సార్లు నుంచి రోజూ
2. హుబ్లీ-విజయవాడ, అమరావతి ఎక్స్‌ప్రెస్. వారానికి మూడు సార్లు నుంచి రోజూ
3. హుబ్లీ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్. వారానికి మూడు సార్లు నుంచి రోజూ
కొత్త లైన్ల సర్వే
1. తిప్టూరు-దుడ్డ.
2. చళ్లకెరె-హిరియూరు-హులియూరు-చిక్కనాయనకహళ్లి-కేబీ క్రాస్, తురువెకెరె, చన్నరాయపట్టణ.
3. బెల్గాం-హుబ్లీ వయా కిత్తూరు
4. బళ్లారి-లింగసుగూరు వయా సిరుగుప్ప, సింధనూరు