the general election
-
జూలు విదిల్చిన సంస్కరణలు!
దశాబ్దాలుగా కదలిక లేకుండా పడివున్న ‘కార్మిక సంస్కరణలు’ సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగానే జవసత్వాలు తెచ్చుకున్నాయి. పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఎన్డీయే సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు ప్రవేశపెట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తికాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్కరణలపై పూర్తిగా దృష్టిసారించి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే కార్యక్రమంకింద పలు కార్మిక సంస్కరణల పథకాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణల విషయంలో ప్రధాన రాజకీయపక్షాలమధ్య దాదాపు ఏకాభిప్రాయం వచ్చినందువల్లనే ఇవి చకచకా ముందుకు కదులుతున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి, కాంట్రాక్టు లేబర్ (క్రమబద్ధీకరణ, రద్దు) చట్టానికి, పారిశ్రామిక వివాదాల చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఆ విషయంలో అందరికీ మార్గదర్శిగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు ప్రకటించింది. హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కార్మిక సంస్కరణలవైపు ఉత్సాహంగా అడుగులేసింది. అసెంబ్లీ ఎన్నికలు లేనట్టయితే ఈపాటికే అవి పూర్తయివుండేవి. దేశంలో కార్మిక రంగ సంస్కరణల కోసం అటు పరిశ్రమల వర్గాలు, ఇటు కార్మిక సంఘాలు ఎన్నాళ్లనుంచో డిమాండు చేస్తున్నాయి. అంతేకాదు... ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లోని కార్మిక చట్టాలు పారిశ్రామికాభివృద్ధికీ, ఉపాధి కల్పనకూ అవరోధంగా పరిణమించాయని హెచ్చరిస్తూ వచ్చాయి. ఇతర దేశాలతో పోలిస్తే తయారీ రంగం విషయంలో భారత్‌ది ఎప్పుడూ వెనక బెంచీయేనని ఆ సంస్థలు చెబుతున్నాయి. నిజమే... స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీ రంగం వాటా 15 శాతం మించదు. మన పొరుగునున్న చైనాలో అది 34 శాతం! యూపీఏ సర్కారుకు ఈ సంస్కరణల విషయంలో ఎంత ఉత్సాహం ఉన్నా రెండో దఫా పాలనలో దాన్ని ఆవరించిన నిస్సత్తువ కారణంగా ముందుకు అడుగేయలేకపోయింది. మన చట్టాల పుణ్యమా అని ఇక్కడ కర్మాగారాలు ప్రారంభించాలన్నా, వాటిని కొనసాగించాలన్నా ఎంతో కష్టమవుతున్నదని పారిశ్రామికవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కార్మిక వ్యవహారాలు ఉమ్మడి జాబితాలోనివి కనుక వీటికి సంబంధించి కేంద్ర చట్టాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఇబ్బందికరంగా పరిణమించాయని వ్యాపార వేత్తలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్తయినా దాదాపు 60 కేంద్ర చట్టాలకూ, రాష్ట్ర స్థాయిలో ఉండే 150కిపైగా చట్టాలకూ అనుగుణంగా ఎన్నెన్నో పత్రాలను సమర్పించాల్సివుంటుంది. అసలు ‘కార్మికుడు’ అనే పదాన్ని నిర్వచించడంలోనే అయోమయం ఉన్నది. ఈ పదానికి వేర్వేరు చట్టాల్లో 27 రకాల నిర్వచనాలున్నాయి. ఈ చట్టాల కీకారణ్యంలో దారితోచక గందరగోళపడుతున్నా మని... వాటిల్లోని జటిలమైన నిబంధనలు అడుగడుగునా ప్రతిబంధకంగా మారా యని వ్యాపారవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలకింద పెట్టే కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయన్నది వారి ఫిర్యాదు. వ్యాపారవృద్ధిపై దృష్టిపెట్టడానికి బదులు ఈ కేసుల పైనే సమయం వెచ్చించవలసి వస్తున్నదని వారి ఆరోపణ. వాహనాల తయారీనుంచి వ్యవసాయం వరకూ...ఉపగ్రహాలనుంచి జలాంతర్గాములవరకూ సమస్తం ఇక్కడే ఉత్పత్తి కావాలని ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్నిచ్చిన మోదీ...దాన్ని విజయవంతం చేయాలంటే ఈ చట్టాల మరమ్మతు తప్పనిసరని సంకల్పించారు. కనుకనే ఆ నినాదం ఇవ్వడానికన్నా ముందు ఆ చట్టాలపై దృష్టిసారించారు. కార్మికసంఘాలు కూడా ఈ చట్టాలను సంస్కరించాలని కోరుతున్నాయిగానీ వాటి దృష్టి కోణం వేరు. ఆ చట్టాలు ఏర్పడిననాటికి ఊహకైనా రాని ఎన్నో రకాలు పరిశ్రమల్లో వచ్చిచేరాయని, వాటిల్లో నిర్దిష్టమైన పనిగంటలు, ఇతర నిబంధనలు ఉండటంలేదని అవి ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత సంస్కరణల్లో వ్యాపారవేత్తలకు ఇబ్బంది కలిగిస్తున్న ‘ఇన్స్పెక్టర్ రాజ్’ను పూర్తిగా తొలగించడం ఒకటి. తనిఖీల పేరుతో వచ్చి కేసులు పెట్టే ప్రస్తుత విధానం స్థానంలో కంప్యూటర్ ఆధారిత డ్రా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏ ఫ్యాక్టరీని తనిఖీ చేయాలో అదే నిర్దేశిస్తుంది. తనిఖీ అనంతరం ఇన్స్పెక్టర్ తన నివేదికను 72 గంటల్లో ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారం ప్రారంభించదల్చుకునేవారు ఇప్పుడున్న 16 రకాల దరఖాస్తుల స్థానంలో ఒకే ఒక దరఖాస్తును...అదికూడా ఆన్లైన్లోనే పంపేవీలుకలుగుతుంది. అయితే, ఇప్పటికీ వ్యాపారవేత్తలు 44 కేంద్ర చట్టాలనూ, దాదాపు 150 రాష్ట్ర స్థాయి చట్టాలనూ అనుసరించాల్సిన స్థితే ఉన్నది. ఈ చట్టాలన్నిటినీ కనిష్ట సంఖ్యకు కుదించడమన్నది ఎప్పుడో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. ఇక పీఎఫ్ ఖాతాల నిర్వహణ, వాటి బదిలీవంటివి సులభతరం చేయడంద్వారా ఉద్యోగులకు మేలు కలగజేయడానికి సర్కారు ప్రయత్నించింది. అయితే, పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగులకుండే ప్రత్యామ్నాయాల విషయంలో మరింత సరళత అవసరమని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కార్మికులను పనిలోకి తీసుకోవ డానికి, తొలగించడానికి సంబంధించిన నిబంధనలు నిక్షిప్తమై ఉండే పారిశ్రామిక వివాదాల చట్టం జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లదల్చుకున్నట్టు లేదు. ఆ బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. ఈ చట్టం విషయంలో కేంద్రమే చొరవ తీసుకుని దేశమంతా వర్తించే విధంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. మొత్తానికి అటు పారిశ్రామికవేత్తలకూ, ఇటు కార్మిక వర్గానికీ ప్రయోజనం చేకూర్చేలా సంస్కరణలు తీసుకురావడం కత్తి మీది సామే. దాన్ని ఎన్డీయే సర్కారు ఎంత చాకచక్యంగా పూర్తి చేయగలుగుతుందో చూడాలి. -
జాబితాలో కనిపించని ‘జనసేన’
దేశవ్యాప్తంగా 100 ! ఎన్నికల తర్వాత పుట్టుకొచ్చిన వైనం జాబితాలో కనిపించని ‘జనసేన’ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయో లేదా అప్పుడే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు తిరక్కముందే ఏకంగా వంద కొత్త రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యాయి. నాలుగు మాసాల కింద ఎన్నికలు జరిగినప్పుడు ఈసీ వద్ద రిజిస్టరైన పార్టీల సంఖ్య 1,593 గా ఉంది. ఈసీ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు ఆ సంఖ్య 1,699 కి చేరింది. కొత్తగా రిజిస్టరైన రాజకీయ పార్టీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 31 ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత హర్యానా (14), మహారాష్ట్ర (13)లో కొత్త పార్టీలు ఏర్పాటు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలే. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పేరు మాత్రం తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో లేదు!.. రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీలుగానే ఎన్నికల సంఘం పరిగణించింది. రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ) మాత్రమే జాతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 54 ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో మరికొన్ని పార్టీలు చేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించగా, తెలంగాణలో ఏఐఎంఐఎం, బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందినవి మినహాయిస్తే 16 వందల పైచిలుకు పార్టీలు కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజస్టరైన పార్టీలుగానే ఉండటం గమనార్హం. -
‘ఉప’ ఫలితాలు
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లభించిన అఖండ విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలి తాలు ఖంగుతినిపించాయి. బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరగ్గా వాటిల్లో కేవలం ఏడు స్థానాలను మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలి గింది. లోక్‌సభ ఎన్నికల్లో దివాళా తీసిన స్థితికి చేరుకున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు చూశాక కాస్త ప్రాణం నిలబడింది. వాస్తవానికి మొన్నటి ఉత్తరాంచల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మూడు స్థానాలూ చేజిక్కాక కాం గ్రెస్‌కు ధైర్యం వచ్చినా, ఇతరచోట్ల... ముఖ్యంగా బీహార్‌లో ఇది సాధ్య పడుతుందని ఆ పార్టీ అనుకోలేదు. సాధారణంగా ఉప ఎన్నికల ఫలి తాలు వాటికవే ఒక ధోరణిని ప్రతిఫలించలేవు. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలు మొదలుకొని కుల సమీకరణాల వరకూ ఏదో ఒక కారణంవల్ల లెక్క తప్పి దెబ్బతినడానికి ఉప ఎన్నికల్లో ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి చిహ్నమని జేడీ(యూ), కాంగ్రెస్ చెబుతున్నాయి. అయితే, మోడీ అధికారంలోకొచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే గడిచిన నేపథ్యంలో ఈ వాదనకు అంత విలువ ఉండదు. ఎన్డీయే సర్కారు ఆచరణ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ ఆచరణ ఫలితాలు ఎలా ఉండగలవో, వాటివల్ల సామాన్యుడికి కలిగేదేమిటో తేలాకగానీ ప్రభుత్వం పనితీరుకూ, ఎన్నికలకూ ముడి పెట్టడం సాధ్యపడదు. అయితే, బీహార్‌లోని పది స్థానాల ఫలితాలు అనేక విధాల కీలకమై నవి. ఈ పదింటిలో 7 జేడీ(యూ)- ఆర్జేడీ కూటమికి లభించగా, బీజే పీకి మూడు వచ్చాయి. వచ్చే ఏడాది మొదట్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కూటమి 31 స్థానాలను గెల్చుకుని పాలక జేడీ(యూ) సర్కారును దిగ్భ్రమపరిచింది. రద్దయిన లోక్‌సభలో 38 స్థానాలుండే జేడీ(యూ)కి దక్కినవి కేవలం రెండంటే రెండే! మిగిలిన ఏడు స్థానాలూ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ కూటమి చేజిక్కించుకుంది. ఆ ఫలితాలు చూశాక బీహార్‌లో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధి కారం చేపట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. మొన్నటి లోక్‌సభ ఫలితాలను బట్టి చూస్తే ఈ 10 స్థానాల్లో బీజేపీకి రావలసినవి 8 సీట్లు. ఇందులో ఆరు స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెల్చుకు న్నవి. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందిన కార ణంగా ఎన్నికలొచ్చాయి. ఆ నాలుగింటిలో ఇప్పుడు బీజేపీకి లభించి నవి రెండు మాత్రమే. ఓడిపోయిన రెండు సీట్లూ ఎప్పటినుంచో బీజేపీ ఖాతాలో ఉన్నవి. సారాంశంలో సెమీ ఫైనల్స్‌గా భావించదగ్గ ఈ అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. బీహార్‌లో దిగ్గజాలన దగ్గ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌లు సామా జిక ఉద్యమాల ద్వారా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నవారు. ఇద్దరికి ద్దరూ ఆ రాష్ట్రంలోని రెండు బలమైన కులాలకు చెందినవారు. ఒకప్పు డు సన్నిహిత మిత్రులే అయినా అనంతర పరిణామాల కారణంగా బద్ధ శత్రువులైనవారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సైతం వీరి నాయకత్వం లోని ఆర్జేడీ, జేడీ(యూ)ల కూటమి సాధ్యంకాలేదు. అలాంటిచోట ఉప ఎన్నికల ముందు అనూహ్యంగా రెండు పార్టీల మధ్యా పొత్తు కుదరింది. మోడీ కనికట్టు ముందు ఇలాంటి పొత్తులు తీసికట్టేనని బీజేపీ బల్లగుద్ది చెప్పింది. కేవలం అధికారాన్ని నిలుపుకొనేందుకు మాత్రమే వీరిద్దరూ సన్నిహితులయ్యారని, ఇందుకు సిద్ధాంత ప్రాతిపదికేమీ లేదని.... రాజ కీయాల్లో ఇలాంటి అవకాశవాదాన్ని ప్రజలు మెచ్చరన్నది. దానికితోడు లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, బీహార్ ఫలితాలను విశ్లేషించిన అనేకమంది నిపుణులు కుల రాజకీయాలకు కాలం చెల్లినట్టేనని అంచనా వేశారు. ప్రజలు అన్నిటికీ అతీతంగా ఒక్కటై హిందూత్వకూ, మోడీకి పట్టంగ ట్టారని తేల్చారు. అందువల్లే మిగిలినవాటికంటే బీహార్ ఉప ఎన్నికలే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అక్కడి 10 స్థానాలూ ఎటు మొగ్గు చూపుతాయన్న అంశంపైనే అందరి దృష్టీ పడింది. నిత్యమూ పరస్పరం తలపడే రెండు బలమైన పక్షాలు ఒక్కటైతే బీజేపీకి గండమేనని ఫలి తాలు తేల్చాయి. అయితే, మొన్నటి లోక్‌సభ ఎన్నికల అనంతరం నితీష్‌కుమార్ వ్యవహరించిన తీరు సైతం ఈ ఫలితాలకు కారణమని గుర్తించాలి. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా తాను సమాధ వుతున్నానని నితీష్ సరిగానే గుర్తించారు. తక్షణం సీఎం పదవిని వదు లుకుని పార్టీని పటిష్టపరచకపోతే, జనంలో విశ్వాసం కలిగించలేకపోతే మనుగడకు ప్రమాదమని నిర్ధారణకొచ్చారు. అందువల్లే అత్యంత వెనక బడిన కులానికి చెందిన మజీని సీఎం చేశారు. లాలూ-నితీష్ కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుందా...కీలకమైన సీఎం పదవి విషయంలో వారు అంగీకారానికొస్తారా అనే అంశాలు బీహార్ రాజకీయాల భవిష్యత్తు గమనాన్ని నిర్దేశిస్తాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రాతిపదిక వేరు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరస కుంభకోణాల్లో కూరుకు పోయి సర్వ భ్రష్టమైపోయింది. ఆ కూటమిని చావుదెబ్బ తీస్తే తప్ప ప్రయోజనం శూన్యమని ప్రజలు భావించారు. అలాంటి నేపథ్యంలో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. నరేంద్ర మోడీ వాక్పటిమ, ఆయన చేసిన వాగ్దానాలు అధికారంలోకొచ్చేందుకు ఆ పార్టీకి ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే, ఆ మాటల్ని ఏ మేరకు చేతల్లో చూపగలదన్న అంశంపై ఆధారపడి మరికొన్నాళ్లలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గ్రహించాల్సింది అదే. -
హస్తం.. హడావుడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో విజయాలను సాధించే దిశగా తలపెట్టిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించి కొత్తవ్యూహాల రచనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. దేశంలోనే మొదటగా రాష్ట్రంలో సదస్సు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా భావించి సదస్సును విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి పాలవ్వడంతో శ్రేణుల్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ.. సదస్సుకు భారీగా తరలిరావడం, హడావుడి వాతావరణం కన్పించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కాగా కొత్తగా తలపెట్టిన ఈ తరహా సదస్సులో ప్రధాన నేతలు మినహా.. ఇతర కీలక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులకు, ఇతర కార్యకర్తలకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభానంతరం పలువురు నేతలు పెదవి విరిచారు. జట్లుగా విడగొట్టి.. అభిప్రాయాలు సేకరించి.. ప్రధాన నేతల ప్రసంగం అనంతరం సదస్సుకు వచ్చిన శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని రచించింది. సామాజిక అంశాలవారీగా పది బృందాలను ఏర్పాటు చేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఆయా బృందాలకు బాధ్యులుగా నియమించారు. సదస్సుకు వచ్చిన కార్యకర్తలు వారి మనోభావాలను ఆయా బృందాల వద్ద వ్యక్తపర్చే అవకాశం ఇచ్చారు. ఈ పది బృందాలను సదస్సు జరిగిన ఆవరణలోనే ఇతర బ్లాకుల్లో వినతులు, అభిప్రాయాలు స్వీకరించే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా బృందాల వద్దకు కార్యకర్తలు వెళ్లి వారి ఆలోచనలు, సూచనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జెండా రెపరెపలు.. ఇబ్రహీంపట్నం మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సదస్సుకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సదస్సు జరిగే ప్రాంతమంతా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. సాగర్ రింగురోడ్డు నుంచి సదస్సు ప్రధాన ద్వారం వరకు పలువురు నాయకులతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిజిటల్ స్క్రీన్లు.. భవిష్యత్ కార్యాచరణ సదస్సు ప్రాంగణం భారీగా ఉండడం.. పెద్ద సంఖ్యలో నాయకగణం హాజరుకావడంతో పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభావేదికలో ఉన్న పెద్దలు.. ప్రసంగించే నాయకులు స్పష్టంగా కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా నేతల ప్రసంగాలను తిలకించారు. ప్రసంగం ప్రారంభం, ముగింపు సమయంలో కరతాలధ్వనులతో సందడి చేశారు. కాగా ఈసదస్సులో జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సదస్సు రెండవరోజు సోమవారం కూడా కొనసాగుతుంది. ఈసందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. -
గొంతెండుతోంది..
మూలకు చేరిన బోర్లు,పథకాలు తాగునీటి కోసం జనం అవస్థలు వేసవి కార్యాచరణకు రూ.18 లక్షలతో ప్రతిపాదన ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.5 లక్షలే 13వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు గొంతెండుతోంది గుక్కెడు నీళ్లివ్వండంటూ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం మహిళలు కిలోమీటర్లు దూరం నడవాల్సిన దుస్థితి. మండుటెండల్లో అష్టకష్టాలు పడుతూ ఊటగెడ్డలకు వెళ్లి నీటిని సేకరిస్తున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: బావులు ఎండుతున్నా.. బోర్లు, మంచినీటి పథకాలు మూలకు చేరినా.. పట్టించుకొనే యంత్రాంగమే కరువైంది. దీనికి తోడు విద్యుత్ కోతలతో మండల కేంద్రాల్లో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. సాధారణంగా వేసవికి ముందే తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ చేస్తుంటారు. ఈ ఏడా ది సార్వత్రిక ఎన్నికలు, కోడ్ వంటి కారణాలతో దీనిని పట్టించుకున్న వారే లేకుండాపోయారు. దీంతో జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధులతో బోర్లు, మంచినీటి పథకాలు బాగు చేయాలని భావిస్తున్నారు. మూలకు చేరిన పథకాలు జిల్లాలో మొత్తం 5444 నివాస ప్రాంతాల్లో కేవలం 798 ఆవాసాల్లోనే పూర్తి స్థాయిలో నీటి వనరులున్నాయి. పాక్షిక్షంగా 4477 ప్రాంతాలకు నీటి అందిస్తుండగా.. సురక్షితం కాని నీటి వనరులు ఉన్న ప్రాంతాలు 133 వరకు ఉన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. అసలు నీటి సరఫరా లేని ప్రాంతాలు 36 ఉన్నాయి. జిల్లాలో 968 రక్షిత మంచినీటి పథకాలు, 1245 మినీ పథకాలు, 27 సమగ్ర రక్షిత పథకాలు ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ప్రస్తుతం మూలకు చేరినట్లు అధికారులే చెబుతున్నారు. 250 పనికిరాకుండా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కొన్ని సక్రమంగా ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు కారణంగా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 18,069 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా నీటిచుక్కలు రాల్చడం లేదు. వీటిని బాగు చేయాలన్న ధ్యాసే అధికారులకు ఉండడం లేదు. రూ.5 లక్షలు విడుదల జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద గ్రామీణ నీటి సరఫరా అధికారులు రూ.19.43 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 లక్షలే మంజూరు చేసింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ నిధులపై దృష్టి సారించారు. పంచాయతీ, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంత మొత్తాలను తాగునీటి సరఫరాకు వెచ్చించాలని యోచిస్తున్నారు. వీటిని కేవలం మంచినీటి పథకాలు, బోర్ల మరమ్మతులకే వినియోగించనున్నారు. ఊటగెడ్డలే ఆధారం గ్రామాలు,గూడేల్లో బావులు ఎండిపోయాయి. బోర్లు మూలకు చేరాయి. పథకాలు నీటిచుక్కలు రాల్చకపోవడంతో గ్రామీణులు ఊటగెడ్డలపైనే ఆధారపడుతున్నారు. కిలోమీటర్ల మేర ఎండలో వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఏజె న్సీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు, తోటవలస, అంజోడ, స్వర్ణగుడ, జాకవలస, బల్లుగుడ, చంపగుడ, ఇలా అనేక గ్రామాల్లో బోర్లు ఏళ్ల క్రితమే పాడయ్యాయి. ఆయా గ్రామాల వారు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. నాతవరం మండలంలోనూ ఇదే దుస్థితి. వేసవి కావడంతో అవి కూడా అడుగంటిపోయాయి. గంటల తరబడి నిరీక్షిస్తే తప్పా.. బిందెడు నీరు రావడం లేదు. ఈ కలుషిత నీటి కారణంగా గ్రామీణులు రోగాల బారిన పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కాలనీల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి ఉండడం గమనార్హం. ఏటా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా.. దీర్ఘకాల ప్రణాళికలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం కొట్టొస్తోంది. -
కారు.. ఫుల్జోరు
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఊపుతో జోరు మీద ఉన్న టీఆర్ఎస్ ఎన్నికలు ముగిశాకా కూడా సీట్ల వేటను కొనసాగిస్తోంది. ప్రత్యర్థి పార్టీల సభ్యులు, స్వంతంత్రులను బుట్టలో వేసుకుని హంగ్‌గా మారిన స్థానిక సంస్థలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రానున్న టీఆర్ఎస్తో జత కట్టి అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇతర పార్టీల సభ్యులూ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు గాలం వేసిన టీఆర్ఎస్ నేతలు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించక ఊగిసలాడుతున్న మండలాలు, మున్సిపాలిటీలపై సైతం ఆకర్ష్ మంత్రం ద్వారా గులాబీ జెండాను ఎగుర వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని ప్రత్యర్థి పార్టీలు సతమతమవుతున్నాయి. జెడ్పీ పీఠం టీఆర్ఎస్ వశం జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 21, టీడీపీ 4 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. ఏ పార్టీ 24 సభ్యుల పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో జిల్లా పరిషత్ హంగ్‌గా ఏర్పడడం అనివార్యమైంది. అయితే, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో జెడ్పీలో బలబలాలు మారిపోయాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి చేరడంతో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌ను సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొంత మంది జెడ్పీటీసీలు సైతం టీఆర్ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ జెడ్పీటీసీ పి.నాగరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణకు సమీప బంధువు కావడంతో ఆమెకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఎంపీపీలు టీఆర్‘ఎస్’ జిల్లాలోని 685 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 296 స్థానాలు, టీఆర్ఎస్ 215 స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో 20 మండలాల అధ్యక్ష స్థానాలను కాంగ్రెస్, 13 మండలాల అధ్యక్ష స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోడానికి సరిపడ ఎంపీటీసీ స్థానాలను ఆయా పార్టీలు గెలుచుకున్నాయి. మిగిలిన 11 మండలాల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. దీంతో ఈ 11 మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు గాలం వేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, ములుగు మండలాల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోడానికి ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఆ రెండు మండలాలూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్రులు అయితే మూకుమ్మడిగా టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి, అందోల్ నియోజకవర్గం పరిధిలోని టేక్మాల్ ఎంపీపీ స్థానాలను స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో టీఆర్ఎస్ సునాయాసంగా కైవసం చేసుకోబోతోంది. మున్సిపాలిటీలూ గులాబీమయమే! సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్, 8 వార్డులును ఎంఐఎం గెలుచుకుంది. ఇక్కడ ఏ పార్టీ మేజిక్ ఫిగర్‌ను సాధించకపోవడంతో చైర్మన్ సీటును కైవసం చేసుకోడానికి ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యుల మద్దతు టీఆర్ఎస్కే లభించనుండడంతో ఆ పార్టీ బలం 10కు పెరిగింది. ఇక ఇక్కడి నుంచి గెలిచిన 5 మంది స్వంతంత్ర సభ్యుల్లో ఇద్దరితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సైతం ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో 16 మంది సభ్యుల మద్దతుతో ఎంఐఎం చెర్మైన్ సీటును కైవసం చేసుకోబోతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ ఈ దిశగా ఎంఐఎంకు పూర్తి సహకారాన్ని అందిస్తుండడం గమనార్హం. సదాశివపేట మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 13 వార్డులు గెలిచి పూర్తి మెజారిటీ సాధించినా, చైర్పర్సన్ ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ పార్టీ నుంచి గెలిచిన పట్నం విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొగ్గు చూపగా..లింగాయత్ సామాజికవర్గానికి చెందిన శీల, పిల్లోడి జయమ్మ, ఆకుల మంజు తదితరులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ తిరుగుబాటును తెర వెనక నుంచి ప్రోత్సహించడం ద్వారా టీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ 5 వార్డులను గెలుచుకోగా మరో 6 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంటే ఆ పార్టీ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో 20 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ, 9 టీఆర్ఎస్, ఓ వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నర్సారెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. టీడీపీ నుంచి ఒకరిద్దరు టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెదక్ మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో టీఆర్ఎస్ 11 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్‌కు చేరుకోలేకపోయింది. అయితే, ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు స్వంతంత్రులు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతుతో టీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ 6, టీడీపీ 5 వార్డులను గెలుచుకోగా.. ఈ రెండు పార్టీలకు చెందిన నలుగురు సభ్యులు కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. -
‘వెస్ట్’లో సమస్యల కూత!
70 ఎకరాల స్థలం ఉన్నా అభివృద్ధికి నోచుకోని వైనం ఉపయోగం లేని కొళాయిలు మూతపడ్డ మరుగుదొడ్లు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెస్ట్ రైల్వేస్టేషన్ ఏళ్ల తరబడి సమస్యల కూత పెడుతోంది. ఈ స్టేషన్ పరిధిలో సుమారు 70 ఎకరాల రైల్వే స్థలం ఉన్నా వినియోగించుకోవడం లేదు. ఫలితంగా మెయిన్ రైల్వేస్టేషన్లో నిత్యం రద్దీతో ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, కేరళ, మైసూర్, వేలూరు, కోయంబ త్తూరు, ధర్మవరం, గుంతకల్, పాకాల మీదుగా సికిం ద్రాబాద్, మహారాష్ట్రలోని అమరావతికి రైళ్లన్నీ ఈ స్టేషన్ మీదుగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని 70 ఎకరాల ఖాళీ స్థలంలో మరిన్ని ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే రైళ్ల రాకపోకల కోసం 3 ప్లాట్‌ఫారాలు, రైలు బండ్ల నిర్వహణ కోసం మరో 3 పిట్లైన్లను నిర్మించుకునే వెసలుబాటు ఉంటుందని స్థానిక ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందించాల్సిన వెస్ట్ రైల్వేస్టేషన్ రాత్రి వేళల్లో అనామకులకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. రెండు లక్షల మంది.. 80 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ పరిధిలో ఇప్పుడు సుమారు 2 లక్షల మందికి పైగా జనాభా ఉంటున్నారు. ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలు, బాలాజీ కాలనీ, ఎల్బీనగర్, ముత్యాలరెడ్డిపల్లె, పేరూరు, రూరల్ మండలంలోని అనేక గ్రామాలకు చెందినవారంతా రైలు ప్రయాణం చేయాలంటే వెస్ట్ రైల్వేస్టేషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ స్టేషన్లో ప్రస్తుతానికి ఒకటి రెండు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లేవీ ఆగడం లేదు. ఆ కారణంగా ఈ స్టేషన్ పరిధిలోని లక్షలాది జనం మెయిన్ రైల్వేస్టేషన్‌కు వెళుతున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరుగుతోంది. ఉపయోగం లేని కొళాయిలు.. ఇక్కడ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిలు పాడైపోయాయి. వాటికి నిర్మించిన సిమెంట్ దిమ్మెలు పగుళ్లు విడిచి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొళాయిల సింకుల్లో వ్యర్థాలు ఉన్నాయి. స్టేషన్‌లోని ప్లాట్ఫారానికి పడమటివైపు అమర్చిన ప్లాస్టిక్ సింథటిక్ ట్యాంకు కూడా దుస్థితికి చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లకు ఇనుప ఊచలు బిగించి మూతవేశారు. ఇక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. భద్రతపై అనుమానాలు వెస్ట్ రైల్వేస్టేషన్ ఆలనాపాలనా గురించి ఓవైపు అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా రైల్వేశాఖ పరిధిలోని రెండు విభాగాల భద్రతాధికారులు, సిబ్బంది సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ కారణంగా స్టేషన్ భద్రతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. తమిళనాడుకు చెందిన వేలాది మంది తిరుమల యాత్రికులు అలిపిరి మార్గంలో పాదయాత్రగా వెళ్లేందుకు ఈ స్టేషన్లో దిగుతుంటారు. అలాంటప్పుడు ఈ స్టేషన్లో కనీసం తనిఖీలు చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా రైల్వే పోలీసులు ఉండడం లేదు. శ్రీవారి దయవల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు... కానీ భద్రతా సిబ్బంది డొల్లతనాన్ని గమనించి ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే దిక్కెవరు? అని స్థానికులు ఆందోళనచెందుతున్నారు. సమయపాలన లేని బుకింగ్ కౌంటర్లు ఈ స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది ఎప్పు డు అందుబాటులో ఉంటారో తెలియదు. టికెట్ల జారీ కోసం ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చారు. నిర్వాహకులు రోజూ కొటాల నుంచి రావాల్సి ఉండడంతో సమయపాలన పాటించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. దాంతో టికెట్ల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కూడా రైల్వే కోల్పోతోంది. టికెట్లు ఇచ్చే వారు ఉండకపోవడంతో ఈ స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరూ టికెట్లు లేకనే రైళ్లలో ప్రయాణిస్తూ టీసీల ద్వారా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వెస్ట్ రైల్వేస్టేషన్‌లోని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఇక సార్వత్రిక సమరం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల పరంపరలో భాగంగా తుది ఎన్నికలకు నేడు తెరలేవనుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ మేరకు తుది యుద్ధానికి సన్నద్ధమవుతున్నా యి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి కలెక్టర్ కాంతిలాల్ దండే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మే 7న జరిగే ఎన్నికలకు సంబంధించి విడుదల కానున్న నోటిఫికేషన్లో అభ్యర్థులకు కావలసిన సమాచారంతో పాటు, వారు అనుసరించాల్సిన నియమ నిబంధనలు పొందుపరుస్తూ ఎన్నికల కమిషన్ పుస్తకాలను పంపిణీ చేసింది. జిల్లాలోని తమ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లను దాఖలు చేసేందుకు నామినేషన్ల స్వీకరణ చివరి రోజున కూడా అందజేసేందుకు అవకాశం కల్పించింది. ఆ రోజు ఆన్లైన్లో మాత్రమే పొందుపరచాలి. ఎన్నికల సమాచారం కోసం కలెక్టరేట్లో 1070 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లాలో 16,86,020 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 8,31,743 మంది, మహిళలు 8,54,170 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు. ఐదు రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు కాల పరిధి తగ్గింది. నామినేషన్లకు ఎనిమిది రోజుల సమయం ఉన్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పటికీ కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 13,14,18 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లు స్వీకరించబోమని కలెక్టర్ ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 23. మే 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంపీ నియోజకవర్గానికి కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గ కేంద్రాలలో గల తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి. ఎంపీ అభ్యర్థి డిపాజిట్ రూ.25 వేలు, ఎమ్మెల్యే రూ.10 వేలు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థి డిపాజిట్‌గా రూ.25 వేల ధరావత్తు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500 ధరావత్తుగా నిర్ణయించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10 వేలు డిపాజిట్ కాగా, అందులో సగం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థి వ్యయపరిమితి రూ.70 లక్షలు కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. ఎంపీ అభ్యర్థి ఫారం -2(ఎ), ఎమ్మెల్యే అభ్యర్థి ఫారం-2(బి)ను సమర్పించాలి. అభ్యర్థులు తమ పిల్లల పేరున ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లోని ప్రతి కాలమ్‌నూ తప్పని సరిగా పూరించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. మే 5వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. అభ్యర్థులు తమ వ్యయ రిజిస్టర్లను ఆర్వోలకు కనీసం మూడుసార్లు చూపించాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24,25 నుంచి నెలాఖరు వరకూ ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఓటరు గుర్తింపునకు 21 రకాల గుర్తింపు కార్డులు ఎన్నికల సంఘం ఈ సారి ఓటరు గుర్తింపునకు 21 రకాల ఐడెంటిటీలను ఆమోదించనుంది. తమ పరిధిలోని ఏవేని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు సైతం తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. -
షురూ అయింది..!
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తుండగా.. పార్టీలు మాత్రం ఒక అడుగు ముందుకేశాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు గత నెల రెండో వారం ముహూర్తంగా నిర్ణయించినా, తర్వాత వాయిదా వేశారు. దీనికి కొనసాగింపుగా గత నెలాఖరులో జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ నేత హరీష్‌రావు ప్రకటించినా అది కూడా జాప్యం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థుల జాబితాపై నేడు, రేపు అంటూ వాయిదా వేస్తుండగా... సీపీఐతో పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు కారణంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈనెల 4, 5వ తేదీల్లో అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పక్షాల జాబితా వెలువరించడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. -
ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి?
నాగర్‌కర్నూల్‌లో రాహుల్‌గాంధీ యూత్ ఫార్ములా మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: యువతను ప్రోత్సహించి రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫార్ములాను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలుచేయనున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే జిల్లా వాసి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అంబేద్కర్ జైభీం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల శ్రీహరిని నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఎంపీ మల్లురవి నిరాకరించడం, ఎంపీ టికెట్ ఆఫర్‌చేసినా టీడీపీని వదిలేది లేదని అచ్చంపేట ఎమ్మెల్యే రాములు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ స్థానానికి ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పర్యటనకు జీఓఎం సభ్యుడు, కేంద్రమంత్రి జైరాం రమేశ్ వచ్చిన సందర్భంగా కూడా నాగర్‌కర్నూల్‌లో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిత్వానికి సరైన నేత లేరని డీసీసీ వర్గాలు తేల్చిచెప్పాయి. రాహుల్‌గాంధీ దూత, ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ద్వారా ఏఐసీసీ స్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ముకురాలకు చెందిన శ్రీహరి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు దేశవ్యాప్తంగా పలు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందుకు ఉపకరించినట్లు ఆయనను నాగర్‌కర్నూలు నుంచి అభ్యర్థిగా బరిలోకి దించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మందా జగన్నాథం మాదిగ సామాజికవర్గం అయినందున, అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని రంగంలోకి దించడం వల్ల విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయన్న ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. -
మోదం....ఖేదం
గట్టిగా కూత పెట్టని ఖర్గే రైలు భారీ వరాలు కురిపించని బడ్జెట్ పరిమితుల్లోనే ఉదార స్వభావాన్ని చూపిన ఖర్గే రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లు నాలుగు నూతన లైన్లకు సర్వే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున ఖర్గే బుధవారం లోక్‌సభలో 2014-15 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పెద్దగా వరాలు కురిపించలేక పోయింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను మాత్రమే ప్రవేశ పెడతానని ఆయన ముందుగానే ప్రకటించారు. అయినా తనకు మొదటిది, చివరిది అయిన ఈ బడ్జెట్లో రాష్ర్టంపై వరాలు కురిపించకపోతారా అని అందరూ ఆశాభావంతో ఉన్నారు. అయితే మధ్యంతర బడ్జెట్ కనుక తనకున్న పరిమితుల్లో ఆయన కొంత మేరకే ఉదార స్వభాన్ని ప్రదర్శించగలిగారు. ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించారు. నాలుగు కొత్త లైన్లకు సర్వేను ప్రతిపాదించారు. మూడు రైళ్ల రాకపోకల రోజులను పెంచారు. ప్రసుత్తం అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో నాలుగింటికి నిధులు కేటాయించారు. వీటిలో కడూరు-చిక్కబళ్లాపురం (85 కి.మీ) గేజ్ మార్పిడి, కడూరు-చిక్కమగళూరు (46 కి.మీ) కొత్త లైను, మద్దూరు-మండ్య (19 కి.మీ), బిరూరు-అజ్జంపూర్ (18 కి.మీ) డబ్లింగ్ పనులు ఉన్నాయి. కొత్త రైళ్లు 1. యశ్వంతపుర-జైపూర్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా గుల్బర్గ 2.యశ్వంతపుర-కత్రా వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా గుల్బర్గ, కాచిగూడ 3. తిరువనంతపురం-బెంగళూరు (యశ్వంతపుర). వారానికి రెండు సార్లు 4. బెంగళూరు సిటీ-చెన్నై. డెయిలీ ఎక్స్‌ప్రెస్ వయా బంగారుపేట, జోలార్ పేట 5. హౌరా-యశ్వంతపుర ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా భువనేశ్వర్, గూడూరు, కాట్పాడి 6. హుబ్లీ-ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్. వయా బిజాపుర 7. వారణాసి-మైసూరు ఎక్స్‌ప్రెస్. వారానికి రెండు సార్లు 8. హుబ్లీ-బెల్గాం డెయిలీ ఫాస్ట్ ప్యాసింజర్ రాకపోకల పెంపు 1. బీదర్-యశ్వంతపుర. వారానికి మూడు సార్లు నుంచి రోజూ 2. హుబ్లీ-విజయవాడ, అమరావతి ఎక్స్‌ప్రెస్. వారానికి మూడు సార్లు నుంచి రోజూ 3. హుబ్లీ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్. వారానికి మూడు సార్లు నుంచి రోజూ కొత్త లైన్ల సర్వే 1. తిప్టూరు-దుడ్డ. 2. చళ్లకెరె-హిరియూరు-హులియూరు-చిక్కనాయనకహళ్లి-కేబీ క్రాస్, తురువెకెరె, చన్నరాయపట్టణ. 3. బెల్గాం-హుబ్లీ వయా కిత్తూరు 4. బళ్లారి-లింగసుగూరు వయా సిరుగుప్ప, సింధనూరు