సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తుండగా.. పార్టీలు మాత్రం ఒక అడుగు ముందుకేశాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు గత నెల రెండో వారం ముహూర్తంగా నిర్ణయించినా, తర్వాత వాయిదా వేశారు. దీనికి కొనసాగింపుగా గత నెలాఖరులో జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ నేత హరీష్‌రావు ప్రకటించినా అది కూడా జాప్యం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థుల జాబితాపై నేడు, రేపు అంటూ వాయిదా వేస్తుండగా... సీపీఐతో పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు కారణంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈనెల 4, 5వ తేదీల్లో అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పక్షాల జాబితా వెలువరించడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
షురూ అయింది..!
Published Wed, Apr 2 2014 3:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement