దివంగత కలెక్టర్ డీకే రవి తల్లి డిమాండ్
రవి మృతి కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ పాదయాత్ర
తుమకూరు : దివంగత కోలారు జిల్లా కలెక్టర్ డీకే రవి మృతి కేసు విచారణలో సీబీఐ నివేదిక వారంలోగా బయట పెట్టాలని తల్లి గౌరమ్మ డిమాండ్ చేశారు. రవి మృతిచెంది ఏడాది పూర్తైప్పటికీ ప్రభుత్వం సీబీఐ నివేదికను బహిరంగపరచకుండా గోప్యంగా ఉంచుతూ ఆలస్యం చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ తల్లి గౌరమ్మ బుధవారం వివిధ కన్నడ సంఘాల ఆద్వర్యంలో అభిమానులు డికె.రవి సమాధికి పూజలు నిర్వహించి హులియూరు దర్గా వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి వాహనంలో కుణిగల్ మీదుగా బెంగళూరు నగరానికి చేరుకుని ఆనందరావుసర్కిల్ వద్ద గౌరమ్మ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా విలేకరులతో గౌరమ్మ మాట్లాడుతూ తన కుమారుడు డీకే రవి మృతిచెందిన ఏడాది నుంచి తీవ్ర సంక్లిష్టస్థితిని అనుభవిస్తున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనేక పోరాటాల మధ్య ప్రభుత్వం సీబీఐ విచారణ కు ఆదేశించినప్పటికీ నివేదికను సీబీఐ అధికారులు బహిరంగపరచకపోవడం దారుణమన్నారు. తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక హత్యకు గురయ్యాడా అనే అనుమానం తమలో నెలకొందన్నారు. తన కుమారుడి మృతికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు న్యాయం లభించలేదన్నారు. వారం రోజుల్లోగా సీబీఐ నివేదిక బయట పెట్టకపోతే రవి మృతదేహాన్ని వెలికితీసి విధానసౌధ ముందు ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వారంలోగా నివేదిక బయట పెట్టాలి
Published Thu, Mar 17 2016 2:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement