ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి
Published Thu, Jan 26 2017 11:55 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
నిర్మల్: చెరువులో ఈతకు వెళ్లిన అన్నదమ్ములు నీట మునిగి మృతి చెందిన సంఘటన నిర్మల్ రూరల్ మండలం ముజిగిలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అయాన్(12), అసద్(10) బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement