కెప్టెన్‌కు సర్వాధికారం!
Published Fri, Dec 13 2013 2:20 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై : పార్టీ పరంగా ఎంతటి కీలక నిర్ణయాలైనా తీసుకునే పూర్తి అధికారాన్ని విజయకాంత్‌కు అప్పగిస్తూ డీఎండీకే సర్వసభ్య సమావేశంలో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. ప్రిసీడియం చైర్మన్ పదవిని రద్దు చేస్తూ, బన్రూటీ రాజీనామాను ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా..? వద్దా..? అని తేల్చుకోవడంతోపాటుగా, ఒక వేళ పోటీ చేసినా కూటమి ఎవరితో అన్న నిర్ణయాన్ని విజయకాంత్‌కే వది లిపెట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూ వస్తున్న విష యం తెలిసిందే. ఏడుగురు ఎమ్మెల్యేలు రెబల్స్ అవతారం ఎత్తిన సమయంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్, ఎమ్మెల్యే బన్రూటి రామచంద్ర న్ రాజీనామా విజయకాంత్‌ను డైలమాలో పడేసింది. ఆయన బాటలో మరి కొందరు ఎమ్మెల్యేలు సిద్ధం అవుతుండటంతో మేల్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతూ, పార్టీలో నెలకొన్న అనిశ్చితి సరిదిద్దడం, పార్టీని సరికొత్త మార్గంలో నడపడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సర్వ సభ్య సమావేశానికి ఆగమేఘాలపై పిలుపునిచ్చారు. సమావేశం: గురువారం సాయంత్రం ఐదు గం టలకు కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాల యంలో సర్వ సభ్య సమావేశం ఆరంభమైంది. గంటన్నర పాటుగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులతో విజయకాంత్ చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేద్దా మా..? వద్దా..?, ఒక వేళ పోటీ చేసినా ఎవరితో కలసి పనిచేద్దాం అన్న విషయంగా పార్టీ నాయకుల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ప్రధానంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు.
రెబల్స్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రెబల్స్‌ను పార్టీ నుంచి తొలగించాలంటూ పలువురు పట్టుబట్టినా విజయకాంత్ మౌనం వహించినట్టు సమాచారం. చివరగా ఓ దశలో ఉన్నవాళ్లు ఉండొచ్చని, ఇష్టం లేని వాళ్లు బయటకు వెళ్లినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆక్రోశాన్ని విజయకాంత్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. తీర్మానాలు: చివరగా ఈ సమావేశంలో చేసిన 12 తీర్మానాల్ని ప్రకటించారు. ఇందులో బన్రూటీ రామచంద్రన్ రాజీనామాను ఆమోదిస్తూ, ప్రిసీడియం చైర్మన్ పదవినే రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా ఎలాంటి కీలక నిర్ణయాల్ని అయినా తీసుకునే సర్వాధికారాన్ని విజయకాంత్‌కు అప్పగించారు.
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారిని తొలగించే విధంగా, కొత్త వాళ్లకు అవకాశం కల్పించే రీతిలో ఓ తీర్మానం చేశారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్న డిమాండ్లతో కూడిన తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తీర్మానం చేసే పార్టీ, తాజాగా ఆ ఊసేలేకుండా తీర్మానాలు చేయడం గమనా ర్హం. దీన్ని బట్టి చూస్తే, లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్‌తో కలసి అడుగులు వేయడానికి డీఎండేకే సన్నద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉదయం తన రెండో కుమారుడు షణ్ముగ పాండియన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శతాబ్దం చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న విజయకాంత్ పరోక్షంగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యే విధంగా వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement