విమలా గౌడ రాజీనామా | Vimala Gowda's resignation | Sakshi
Sakshi News home page

విమలా గౌడ రాజీనామా

Published Fri, Jul 11 2014 3:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

విమలా గౌడ రాజీనామా - Sakshi

విమలా గౌడ రాజీనామా

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ విమలా గౌడ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను  చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి ఆమోదించారు. బీజేపీకి చెందిన చైర్మన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు ఇటీవల పదవీ గండం ఏర్పడింది. శాసన మండలిలో మొన్నటి వరకు ఆ పార్టీకే మెజారిటీ ఉండేది.

ఇటీవల జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ సభ్యుల నియామకం ద్వారా అధికార కాంగ్రెస్ బలం పెరగడంతో పాటు బీజేపీకి సంఖ్యా బలం తగ్గింది. అయితే సభలో ఇప్పటికీ అతి పెద్ద పార్టీ. ముగ్గురు స్వతంత్రులతో పాటు జేడీఎస్ సహకారంతో ఈ రెండు పదవులను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహం పన్నింది.

ఈ వారంలో ఆ వ్యూహం ఫలిస్తుందని కూడా అనుకున్నారు. అయితే బీజేపీ బుధవారం హఠాత్తుగా జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవిలో శంకరమూర్తి కొనసాగుతారు. డిప్యూటీ చైర్మన్ పదవిని జేడీఎస్‌కు చెందిన పుట్టన్న అధిష్టించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement