
రైజింగ్‌లో ఐశ్వర్యరాజేశ్
నటి ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్నారు. కథానాయిక పాత్రలయితేనే నటిస్తాను అని మడి కట్టుకు కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఏ పాత్రనయినా చాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్‌కిప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక పక్క హీరోయిన్‌గానూ, మరో పక్క ముఖ్య పాత్రల్లోనూ ఎడాపెడా నటించేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి.
రమ్మి, పన్నయారుం పద్మియుం తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాజేశ్ శీనురామసామి దర్శకత్వంలో నటించిన ఇదం పొరుళ్ ఏవల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఒక కుట్రముదండనై, దీపావళి చిత్రాలతో పాటు నటి కుష్భూ తన అవ్ని సినీమాక్స్ పతాకంపై నిర్మిస్తున్న హలో నాన్ పెయ్‌పేసుగిరేన్, రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం ఫేమ్ అహ్మదు దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
అదేవిధంగా అరుళ్‌నిధి హీరోగా ఈరం చిత్రం ఫేమ్ అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న ఆరదు సినమ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు కొత్త చిత్రాలను అంగీకరించినట్లు ఐశ్వర్యరాజేశ్ తెలిపారు. జాలీయ అవార్డును గెలిసుకున్న కాక్క ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేశ్ కథలో పాముఖ్యత ఉన్న ఎలాంటి పాత్రనయినా పోషించడానికి సిద్ధం అంటున్నారు.