భార్యతో బలవంతంగా మద్యం తాగించి..
పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లా హదాప్సర్కు చెందిన ఓ వ్యక్తి భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. బాధితురాలు (40) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఆమె పట్ల బలవంతంగా మద్యం తాగించేవాడు. ఆ తర్వాత తన స్నేహితులతో గడపాల్సిందిగా ఆమెను బలవంతం చేసేవాడు. అతని డిమాండ్లకు ఒప్పుకోకపోతే భార్యను సిగరెట్ పీకలతో కాల్చి చిత్రహింసలు పెట్టేవాడు. కుటుంబ సభ్యులు అతన్ని మందలించకుండా వంతపాడేవారు. ఆమెను దూషిస్తూ వేధించేవారు.
భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది. వనోవ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త, అతని తల్లి, తమ్ముడు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుంది.