మద్యం మత్తులో మహిళ వీరంగం | Woman under the influence of alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మహిళ వీరంగం

Published Sun, Mar 26 2017 11:26 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

మద్యం మత్తులో మహిళ వీరంగం - Sakshi

మద్యం మత్తులో మహిళ వీరంగం

చెన్నై(అన్నానగర్‌):
లాల్‌కుడిలో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ వీరంగం సృష్టించింది. లాల్‌కుడిలోని ఓ మద్యం షాపులో శుక్రవారం పూటుగా మద్య సేవించిన ఓ 35 సంవత్సరాల మహిళ పక్కనే రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు సహాయం చేసేందుకు కొంతమంది అక్కడకు చేరారు. అయితే వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆ మహిళ వీరంగం చేసింది.

 దీనిపై సమాచారంతో అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు సదరు మహిళను ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే ఒకవైపు నుంచి ఎక్కిస్తే మరోవైపు నుంచి బయటకు వస్తూ వారిని కూడా ఆ మహిళ నానా తిప్పలు పెట్టింది. చేసేదిలేక వారు కూడా అక్కడి నుంచి కొద్దిసేపటికే వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement