పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య ఆత్మహత్య | Women commits suicide, husband forgets to whish on wife birthday in chennai | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య ఆత్మహత్య

Published Fri, Jul 15 2016 5:42 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య ఆత్మహత్య - Sakshi

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య ఆత్మహత్య

చెన్నై: పుట్టినరోజు భర్త శుభాకాంక్షలు చెప్పకపోవడంతో విరక్తి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని మన్నడిలో చోటు చేసుకుంది. మన్నడి ముత్తుమారి శెట్టి వీధికి చెందిన అశోక్‌కుమార్, శోభన భార్యభర్తలు. అశోక్‌కుమార్ రెడ్‌హిల్స్‌లో చిన్న ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.

బుధవారం పుట్టినరోజు కావడంతో శోభన ఉదయాన్నే భర్త చెప్పే పుట్టిన రోజు శుభాకాంక్షల కోసం వేచి చూసింది. అయితే అశోక్‌కుమార్ పుట్టినో రోజు శుభాకాంక్షలు చెప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో తీవ్రమనస్థాపం చెందిన శోభన ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన స్థానికులు శోభనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement