birth day whishes
-
మంచువారింట ఐరా బర్త్‌డే సందడి
మంచు విష్ణు ఐరానిక దంపతుల చిన్న కూమార్తె ఐరా విద్య మొదటి పుట్టినరోజు కావడంతో వారింట సందడి నెలకొంది. ఐరా పుట్టినరోజు సందర్భంగా విష్ణు ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘మా ఐరా ఈరోజుతో మొదటి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇదే నా పరివారం’అంటూ విష్ణు ట్విటర్లో పేర్కొన్నారు. కాగా విష్ణు ఐరానిక దంపతులకు నలుగురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్, ఐరా అన్న సంగతి తెలిసిందే. వీరిలో అరియానా, వివియానా కవలలు. సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో ఐరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (బ్రదర్ అండ్ సిస్టర్) Wishing my bruh, superstar @urstrulyMahesh many more returns of the day. Keep rocking my brother. God Speed! — Vishnu Manchu (@iVishnuManchu) August 9, 2020 -
లెజెండరీ సింగర్ బర్త్‌డే : శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 73వ బర్త్‌డే సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. అభిమాన గాయకుడికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలుపడంతో ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది. బాలుగా పేరొందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వేలాది పాటలకు సుమధుర గాత్రంతో ప్రాణం పోశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఆరు జాతీయ ఫిల్మ్ అవార్డులు, 25 సార్లు ఏపీ ప్రభుత్వ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2001లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మవిభూషణ్ అవార్డు ఆయనను వరించాయి. చదవండి : ఎస్పీ బాలు నోటా కరోనా పాట! -
ప్రదానికి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
ప్రధానికి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేడు 69వ పుట్టిన రోజుల వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ‘గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షలు అందుతున్నాయి. 69వ జన్మదినం సందర్భంగా తొలుత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు. -
అందరికీ ధన్యవాదాలు
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తనలోని నటుణ్ణి మరింత సానపెడుతున్నారు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. గురువారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సాయీ.. హ్యాపీ బర్త్‌డే. సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు శీను’ సినిమా చేసాను. కొత్త హీరోతో చేసినట్లు అనిపించలేదు. అలవాటు ఉన్న హీరోతో చేసిన అనుభూతి కలిగింది. బోయపాటిగారితో మంచి యాక్షన్ సినిమా చేశాడు. ఆర్టిస్టుగా సాయి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు. సినిమా ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి. కానీ సాయి మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అవ్వడన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సాయి శ్రీనివాస్ బెల్లంకొండకు పుట్టినరోజు∙శుభాకాంక్షలు. సాయి హీరోగా కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్. సాయి హీరో అవుతానన్నప్పటి నుంచి అతని వర్క్ చూస్తూనే ఉన్నాం. సందేహం లేదు. సినిమా సినిమాకి యాక్టింగ్, డ్యాన్స్‌లో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మంచి కథలను ఎంపిక చేసుకుంటే టాలీవుడ్లో సాయి శ్రీనివాస్ వన్నాఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదు. సరైన ఆర్టిస్టుకు మంచి సినిమా పడితే మంచి స్టార్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సాయికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఇంతకుముందు ‘దిల్’ రాజుగారు మాట్లాడుతూ మంచి కథలను ఎంపిక చేసుకోవాలి అన్నారు.ఇప్పుడు మేం సాయితో చేస్తున్న సినిమా కథ భిన్నమైనదని అనుకుంటున్నాం. యాక్షన్, డ్యాన్స్‌ల్లో సాయిని పర్ఫెక్ట్గా చూసి ఉంటారు. ఈ సినిమాలో తన నటనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల జాబితాలోకి సాయిగారి పేరు ఈ ఏడాదే చేరుతుందని చెప్పగలను’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ అంకుల్ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. అనిల్‌గారు వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అజయ్ భూపతిగారికి, ఇంకా నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్‌కి ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, బెక్కెం వేణుగోపాల్, మల్టీ డైమన్షన్ వాసు పాల్గొన్నారు. -
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య ఆత్మహత్య
చెన్నై: పుట్టినరోజు భర్త శుభాకాంక్షలు చెప్పకపోవడంతో విరక్తి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని మన్నడిలో చోటు చేసుకుంది. మన్నడి ముత్తుమారి శెట్టి వీధికి చెందిన అశోక్‌కుమార్, శోభన భార్యభర్తలు. అశోక్‌కుమార్ రెడ్‌హిల్స్‌లో చిన్న ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. బుధవారం పుట్టినరోజు కావడంతో శోభన ఉదయాన్నే భర్త చెప్పే పుట్టిన రోజు శుభాకాంక్షల కోసం వేచి చూసింది. అయితే అశోక్‌కుమార్ పుట్టినో రోజు శుభాకాంక్షలు చెప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో తీవ్రమనస్థాపం చెందిన శోభన ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన స్థానికులు శోభనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.