
కూటి కోసం.. కోటి కష్టాలు..
అంతేకాకుండా అందరు చీని కాయలు వేసి లోడ్ లారీల పైనే ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణం ప్రమాదం అని వారికి తెలిసినా కడుపు నింపుకొవడం కోసం , పిల్లల్ని చదివించడం కోసం తప్పని సరిగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. వర్షానికి తడుస్తూ , వీచే వీదురు గాలులకు తట్టుకొని లారీ టాప్‌పై వెళ్తున్న మహిళా కూలీలను ‘ సాక్షి ’ కెమెరా క్లిక్ అనిపించింది . ఈ ప్రయాణాన్ని చూసిన వారందరు అయ్యో పాపం అని అంటున్నారు.