'స్నేహితులే కొట్టి చంపారు'
Published Tue, Sep 13 2016 3:04 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం దేవులగూడలో యువకుడి మృతదేహంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మాలోత్ భరత్‌కుమార్(23) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో గాయాలతో పడి ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భరత్‌కుమార్‌ను అతడి స్నేహితులు సోమవారం ఉదయం బయటకు తీసుకెళ్లారని, వాళ్లే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మంగళవారం ఉదయం స్థానిక అంతర్రాష్ట్ర రహదారిపై మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో చేపట్టారు. భరత్‌కుమార్ మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement