కోర్టుకు హాజరైన యువరాజ్ | Yuvraj in Attending court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన యువరాజ్

Published Fri, Mar 4 2016 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

కోర్టుకు హాజరైన యువరాజ్

కోర్టుకు హాజరైన యువరాజ్

సేలం:  ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ హత్య కేసులో చార్జ్ షీట్ గురువారం కోర్టులో దాఖలైంది. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన  చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై వ్యవస్థాపకుడు యువరాజ్‌తో పాటు 17 మంది అరెస్టు అయ్యారు. యువరాజ్, ఆయన తమ్ముడు తంగ దురై ల మీద గుండా చట్టం నమోదు అయింది. వేలూరు జైల్లో యువరాజ్, సేలం జైల్లో మరో ఆరుగురు విచారణ ఖైదీలుగా ఉన్నారు. పది మందిబెయిల్ మీద బయటకు వచ్చారు.
 
  ఈ కేసులో విచారణను ముగించిన సీబీసీఐడీ గురువారం చార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. 1 318 పేజీలతో ఈ చార్జీ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయడంతో విచారణను  జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 17వ తేదీన నిందితులు విచారణ నిమిత్తం ఆ కోర్టుకు  హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, విచారణ నిమిత్తం యువరాజ్‌తో పాటుగా మిగిలిన వారిని కోర్టుకు తీసుకురావడంతో గట్టి భద్రతా ఏర్పాట్లను ఆ పరిసరాల్లో పోలీసు యంత్రాంగం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement