'త్వరలో రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణ' | yv subba reddy inaugurates skill development center in ongole | Sakshi
Sakshi News home page

'త్వరలో రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణ'

Published Sun, Oct 2 2016 12:18 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

yv subba reddy inaugurates skill development center in ongole

ఒంగోలు : మరికొద్ది రోజుల్లోనే రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం చేపడతామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగమ్మ కాలేజీలో ప్రకాశం నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

జిల్లాలోని నిరుద్యోగ యువతకి భరోసా కల్పించే కార్యక్రమంగా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో జిల్లాలోని నిరుద్యోగులందరికీ శిక్షణా, ఉద్యోగం కల్పించడమే లక్ష్యమని వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement