
సాక్షి, కూకట్‌పల్లి : అది పేదలే కాదు మధ్యతరగతి పౌరుల అవసరాలు తీర్చే ఆస్పత్రి. ప్రధాన రహదారి వెంటే ఉండటంతో ఆ ఆస్పత్రిలోకి వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువే. సాధారణంగా ఆస్పత్రిని వైద్యాలయం అంటారు. ఎందుకంటే పవిత్రమైనది. కానీ, కొంతమంది ప్రబుద్ధులు ఆ ఆస్పత్రిని తాగుబోతుల అడ్డాగా మార్చారు. ఇది మరెక్కడో కాదు.. నగరంలో నడిబొడ్డులోని కూకట్‌పల్లిలోగల ప్రభుత్వ వైద్యశాల. చుట్టుపక్కల వారు ఆస్పత్రిలో పరిస్థితులు వివరించడంతో అక్కడికి వెళ్లిన సాక్షి కెమెరాకు అక్కడ షాకింగ్ విషయాలు తెలిశాయి.
ఆస్పత్రి సిబ్బందే తాగుబోతులైన దృశ్యాలు స్పష్టంగా చిక్కాయి. మందేసి నిషాలో తేలుతున్న సిబ్బంది దర్శనం ఇచ్చారు. ఏం చక్కా వారు ఆస్పత్రి పడకలనే మందేసే టేబుళ్లుగా మార్చుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తూ దొరికిపోయారు. వైద్యం కోసం వచ్చిన వారికి వారు మందేసి సేవలు అందించడం కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అంతేకాదు ఆస్పత్రిలోని పలు పరికరాలు కూడా వారు విచ్చలవిడిగా వాడుకుంటున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment