108 సిబ్బందితో చర్చలు సఫలం : లక్ష్మారెడ్డి | 108 employees to withdraw strike, says Ch Lakshma Reddy | Sakshi
Sakshi News home page

108 సిబ్బందితో చర్చలు సఫలం : లక్ష్మారెడ్డి

Published Sun, May 24 2015 1:13 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

108 employees to withdraw strike, says Ch Lakshma Reddy

హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 సిబ్బందితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం 108 సిబ్బందితో ఆయన చర్చలు జరిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... సమ్మె విరమించేందుకు 108 సిబ్బంది అంగీకరించారని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి రెండు నెలల సమయం కావాలని 108 సిబ్బందిని కోరినట్లు చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. 108 సిబ్బంది సమ్మె కాలానికి సంబంధించిన జీతంపై ఇప్పటికే జీవికేతో చర్చించినట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement