CH Lakshma reddy
-
ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం కోఠిలోని 104 ఆరోగ్య కేంద్రంలో ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరగడం బాధాకరమని ఆయన చెప్పారు. -
'ఎన్టీఆరే... బాబును గాడ్సేతో పోల్చారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది చంద్రబాబే అని వారు ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే ... చంద్రబాబును గాడ్సేతో పోల్చిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చంద్రబాబు నైజం అనైతికమంటూ విమర్శించారు. ఓటుకు కోట్లు అంశంపై ఇప్పటికీ ఎందుకు స్పందించలేదని చంద్రబాబును జూపల్లి, లక్ష్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. 1995లో వేల రూపాయల ఆదాయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లను ఏ విధంగా సంపాదించారని నిలదీశారు. ఓటుకు కోట్లు అంశంలో అరెస్ట్ అయిన కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. రేవంత్‌కు న్యాయస్థానంలో శిక్ష తప్పదని జూపల్లి, లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. -
108 సిబ్బందితో చర్చలు సఫలం : లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 సిబ్బందితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం 108 సిబ్బందితో ఆయన చర్చలు జరిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... సమ్మె విరమించేందుకు 108 సిబ్బంది అంగీకరించారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రెండు నెలల సమయం కావాలని 108 సిబ్బందిని కోరినట్లు చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. 108 సిబ్బంది సమ్మె కాలానికి సంబంధించిన జీతంపై ఇప్పటికే జీవికేతో చర్చించినట్లు చెప్పారు. -
'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'
ఆదిలాబాద్: రాష్ట్రంలో ఆరు పడకల ఆస్పత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులు మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను వెయ్యి పడకల ఆస్పత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన ఏరియా ఆస్పత్రిని మంత్రులు సీహెచ్ లక్ష్మారెడ్డి, ఎన్. ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో వైద్య సేవలు క్షీణించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి... టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య సేవలు మెరుగయ్యాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగు పరుస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.