దూసుకెళ్లిన లారీ.. 13 గొర్రెలు మృతి | 13 sheeps kill in lorry accident at adilabad | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన లారీ.. 13 గొర్రెలు మృతి

Published Sat, Jan 23 2016 2:08 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

13 sheeps kill in lorry accident at adilabad

కుంటాల: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గొర్రెల కొట్టంలోకి దూసుకెళ్లిన ఘటనలో 13 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కుంటాల మండలం జాక్‌పల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని చెందిన నాగన్న, సాయన్నలకు చెందిన గొర్రెల కొట్టంలోకి తెల్లవారుజామున ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement