డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి
హసన్‌పర్తి : జిల్లావ్యాప్తంగా 2.50కోట్ల టేకు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హరితహారం కింద అన్ని గ్రామాల్లో టేకు మొక్కల పెంచడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దీనికోసం టేకు నర్సరీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డ్వామా ద్వారా 1.10కోట్లు, అటవీ శాఖ ద్వారా 1.40కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయిం చినట్లు చెప్పారు. హసన్‌పర్తి మండలం సీతానాగారం, అన్నాసాగరంలో నర్సరీలు ఏర్పాటు చేయగా, సీతంపేట, అర్వపల్లి, సిద్ధాపురం గ్రామాల్లో అటవీ శాఖ నర్సరీలు ఉన్నాయన్నారు.
ప్రతి గ్రామంలో 30వేల టేకు మొక్కలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్న, చిన్నకారు రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొక్కలు పెంచడానికి అర్హులని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రధాన రహదారులు, ఎస్సారెస్పీ భూముల్లో సైతం మొక్కలు పెంపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క మొక్కను పెంచడానికి నెలకు రూ.5 చొప్పున చెల్లిస్తామని అన్నారు. మొక్కలు నాటడం(గుంతలు తీయడం, నాటడం) కోసం రూ.16.50 చెల్లిస్తామని వివరించారు. పనులను స్వశక్తి గ్రూపులకు అప్పగించనున్నట్లు తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీతానాగారం ఫీల్డ్ అసిస్టెంట్ రవిని సస్పెండ్ చేస్తున్నట్లు పీడీ శేఖర్‌రెడ్డి తెలిపారు.
‘మామిడి’కి ప్రోత్సాహం
అలాగే మామిడి మొక్కల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు డ్వామా పీడీ తెలిపారు. మొక్కల పెంపకం ఖర్చు నిమిత్తం ఒక్కో మొక్కకు ప్రతి నెలా రూ.15 చొప్పున భరిస్తామన్నారు. మూడేళ్లపాటు ప్రభుత్వమే మొక్కల మెరుుంటనెన్స్ కో సం డబ్బులు చెల్లిస్తుందన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీవాణి, ఏపీడీ మాలతి, ఏపీఓ సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.
2.50కోట్ల టేకు మొక్కల పెంపకం
Published Fri, Mar 27 2015 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM
Advertisement
Advertisement