రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు.
మహదేవ్‌పూర్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన రఘునాథ స్వామి(75) వడదెబ్బకు గురై మృతి చెందగా.. మండలంలోని ఎంకపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య(40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు వడదెబ్బ తగిలి చనిపోయాడు.