భూ కుంభకోణం ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ల బదిలీ
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో 29 మంది సబ్ రిజిస్ట్రార్‌లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు ఇటీవల వెలుగుచూసింది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం.
ఈ కేసులో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రియల్‌ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పీవీఎస్ శర్మ, పీఎస్ పార్థసారథిలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ల ప్రస్తుత స్థానాలు, బదిలీ స్థానాల వివరాలివి..