సాక్షి, రంగారెడ్డి జిల్లా: కంటైన్‌మెంట్ జోన్లపై సర్కారు నిఘా పకడ్బందీగా కొనసాగనుంది. జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను20 కంటైన్మెంట్ జోన్లుగా విభజించా రు. జిల్లా పరిధిలో కి వచ్చే జీహెచ్‌ఎంసీ ఏరియా లో 11, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు గ్రా మీణ ప్రాంతాల్లో కలిపి మరో 9 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించారు. ఈ జోన్లపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎంట్రీ.. ఎగ్జిట్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు.బయటివారు ఈ జోన్లలోకి.. ఇక్కడివా రు బయటకు వెళ్లకుండా 24 గంటలపాటు నిఘాను ఏర్పాటు చేశారు. ఇక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసరాల కొరత రాకుండా యంత్రాంగం దృష్టి సారించింది.అన్ని అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యతలను కొందరు అధికారులకు కట్టబెట్టింది. ప్రతిరోజు కంటైన్‌మెంటు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికులఇబ్బందులను వారు అడిగి తెలుసుకొంటు న్నారు. నిత్యావసరాలు ఆయా ప్రాంతాలకే వచ్చేలా చేశారు.క్వారంటైన్ కేంద్రం,హోం క్వారంటైనులో ఉన్నవారిపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు.
30 వేల ఇళ్లపై నిఘా..
నిర్బంధ ప్రాంతాల్లో సుమారు 30వేల నివాసాలు ఉండగా.. ఇక్కడ మొత్తం 1.38 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ ఇళ్లపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. అలాగే స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరో గ్య శాఖ అధికారులు నిత్యం వాకబు చేస్తున్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ ప్రాంతంలోని కంటైన్మెంట్ జోన్లలో ఒక్కో బృందం నిత్యం 70 ఇళ్లకు వెళ్లే ఆరాతీస్తోంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఒక పోలీసు ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో బృందం రోజూ 60 ఇళ్లను పర్యవేక్షిస్తుంది.
ఈ కుటుంబ సభ్యులను నేరుగా కలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరిస్తోంది.అనుమానితలక్షణాలు ఉన్నట్లుగుర్తిస్తే వెంటనే అప్రమత్తమై.. వీరి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు.
28 రోజులు తప్పనిసరి
వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన, మర్కజ్ నేపథ్యం ఉన్న వారందరినీ 28 రోజులపాటు హోం క్వారంటైన్ చేస్తున్నారు. గతనెల ఒకటి నుంచి అదే నెల 22వ తేదీ వరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 4,654 ప్రయాణికుల్లో ఇప్పటివరకు సుమారు 4వేల మంది 28 రోజుల హోం క్వారంటైన్ పీరియడ్‌ని పూర్తిచేసుకున్నారు. మిగిలిన మరో
ఆరు వందలకుపైగా ప్రయాణికులు స్వీయ నిర్బధంలో ఉంటున్నారు. అలాగే మర్కజ్ నేపథ్యంలో పాజిటివ్ కేసులకు సంబంధించిన 663 ప్రైమరీ కాంటాక్టులు కూడా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారందరిపైనా నిఘా కొనసాగుతూనే ఉంది.
పకడ్బందీగా లాక్‌డౌన్
కరోనా ఛాయల్ని దరిదాపులోకి రానివ్వకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి, కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల మూడు వరకు లాక్‌డౌన్‌ను పొడగించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం.. లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా లాక్‌డౌన్ ఉల్లంఘనలపై పోలీసులు నజర్ పెడుతున్నారు. నిత్యావసర సరకులదుకాణాలు, బయట మార్కెట్ల వద్ద రోజువారీగా కనిపిస్తున్న రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రజల్లో ఇంకొంత అవగాహనను ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు పెంపొందిస్తున్నారు. పట్టణాలు, గ్రా మాల్లో పారిశుద్ధ్య చర్యలను మరింత పక్కాగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లలో మరిన్ని సహాయ చర్యల్ని తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment