మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం మద్దెలబీడ్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం మద్దెలబీడ్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేటకు చెందిన ఆర్టీసీ బస్సు మద్దూరు నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా... అతివేగం కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఆ సమయంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు 30 మంది బస్సులో ఉన్నారు. వీరితోపాటు మరో 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఓ పది మందికి కొంచెం బలమైన గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.