అత్యధికంగా మిర్యాలగూడలో 81.6 మి.మీ..
- అత్యల్పం బొమ్మలరామారంలో 2 మి.మీ నమోదు
- రోహిణీకార్తె ప్రారంభం రోజునే కరుణించిన వరుణుడు
- భూమి పదును కావడంతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్న రైతులు
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణీ కార్తె ప్రారంభం రోజే వర్షం పడడంతో అన్నదాతలు ఖరీఫ్ ఏరువాకకు సిద్ధమవుతున్నారు. చందంపేట, డిండి, మఠంపల్లి, హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, తుంగతుర్తి, నూతన్‌కల్, ఆత్మకూరు(ఎస్), చివ్వెంల, మోతె, నడిగూడెం, మునగాల మండలాలు మినహా మిగతా 45 మండలాలలో వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 24.8 మిల్లీమీటర్లుగా నమోదైంది.
అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 81.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బొమ్మలరామారం మండలంలో 2 మిల్లీమీటర్లు కురిసింది. తుర్కపల్లిలో 43.6, రాజాపేటలో 56.6, యాదగిరిగుట్టలో 37.6, ఆలేరులో 36, గుండాలలో 60, తిరుమలగిరిలో 28 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా జాజిరెడ్డిగూడెంలో 36, శాలిగౌరారం 40.4, మోత్కూరులో 56.4, ఆత్మకూర్(ఎం) 19.2, వలిగొండలో 38.2, భువనగిరిలో 43.2, బీబీనగర్‌లో 8.6. మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు పోచంపల్లిలో 6, చౌటుప్పల్‌లో 19.6, రామన్నపేటలో 28.6, చిట్యాలలో 14, నార్కట్‌పల్లిలో 34.8, సూర్యాపేటలో 10.8, పెన్‌పహాడ్‌లో 3.4, వేములపల్లిలో 62.02, తిప్పర్తిలో 32.8.
నల్లగొండలో 35.2, మునుగోడు 20 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నారాయణపూర్‌లో 10, మర్రిగూడలో 4.6, చండూరులో 50.8, కనగల్‌లో 31, నిడమనూరులో 62.2, త్రిపురారంలో 60.6, గరిడేపల్లిలో 2.4, నేరేడుచర్లలో 47.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దామరచర్లలో 67.2, అనుములలో 54.4, పెద్దవూరలో 15.2, పీఏపల్లి 3, గుర్రంపోడులో 9, నాంపల్లిలో 25.6, చింతపల్లిలో 5, దేవరకొండలో 4.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. చాలా మండలాలలో పదునయ్యే వర్షం పడడంతో అన్నదాతలు దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. జూన్ మొదటివారంలో మృగశిరకార్తె ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటినుంచే దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచుకుని మరోసారి వర్షం కురవగానే పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.