
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్వీ.కర్ణన్ మంగళవారం చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ జీకే.అరుణ్ సుందర్ త్యాలన్ సమక్షంలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదు నామినేషన్లను తిరస్కరించగా.. 29 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు.
తిరస్కరణకు గురైన వాటిలో వంకాయలపాటి నాగేశ్వరరావు, మార్త రాజయ్య, గద్దల సుబ్బారావు, గాదె నర్సింహారెడ్డి, కాసాని అయిలయ్య నామినేషన్లు ఉన్నాయి. అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడం.. ప్రతిపాదన చేసిన వారి సంతకాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వంటి కారణాలతో తిరస్కరించారు. కార్యక్రమంలో జేసీ అనురాగ్ జయంతి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి మదన్‌గోపాల్, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు, నామినేషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు, ప్రతిపాదకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment