సీనియర్‌లోనూ సేమ్ | 57 per cent of the passin inter exam | Sakshi
Sakshi News home page

సీనియర్‌లోనూ సేమ్

Published Tue, Apr 28 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

57 per cent of the passin inter exam

57 శాతం మంది ఉత్తీర్ణత
రాష్ట్రస్థాయిలో మూడో స్థానం
 గతేడాదితో పోలిస్తే 2 శాతం మెరుగు
 
ఇంటర్ ‘ద్వితీయ’ ఫలితాల్లో మళ్లీ బాలికలదే పైచేయి

 
విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేరుు సాధించారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర స్థారుులో వరంగల్ జిల్లా 57 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి 75 శాతంతో ప్రథమ, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు 64శాతంతో ద్వితీయ స్థానాల్లో నిలిచారుు.

 మొత్తం 23,032 మంది ఉత్తీర్ణత

జిల్లాలో ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 40,563 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యూరు. ఇందులో 23,032 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో  19,538 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 10,140 మంది (52 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 21,025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 12,892 మంది (61శాతం) ఉత్తీర్ణులయ్యూరు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రెండు శాతం ఉత్తీర్ణత పెరిగిందని ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మలహల్‌రావు వెల్లడించారు. గత ఏడాది జిల్లాలో మొత్తంగా  55 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యూరు.

ఒకేషనల్ విభాగంలో...

ఒకేషనల్ కోర్సుల్లో 3,816 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరు కాగా.. 1,992 మంది (52.2 శాతం) పాస్ అయ్యూరు. బాలురు 2028 మంది పరీక్షలకు హాజరు కాగా.. 982 మంది (47శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1748 మందికి 1010 మంది (58శాతం) ఉత్తీర్ణులయ్యూరు.

సర్కారు కళాశాలలో 59 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 3,438 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 2023 మంది ఉత్తీర్ణత (59 శాతం) సాధిం చారు. బాలురు 1621 మంది పరీక్షలు రాయగా,  909 మం ది (56 శాతం) ఉత్తీర్ణులయ్యూరు. బాలికలు 1,814 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,114 మంది (61.41 శాతం) పా స్ అయ్యూరు. ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 847మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..  614మంది (72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 547 మందికి 382 మంది విద్యార్థులు 69.84 శాతంతో, బాలికల విభాగంలో 300 మందికి 232 మంది 77.33 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.

టాప్ కొత్తగూడ.. లాస్ట్ పరకాల జీజేసీ

కొత్తగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలో 94.08 శాతం ఉత్తీర్ణతతో టాప్ స్థానంలో నిలిచింది. ఇందులో 152 మంది వి ద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 143 మంది ఉత్తీర్ణుల య్యూరు. జఫర్‌గఢ్ జీజేసీలో 81 మంది విద్యార్థులకు 73 మంది విద్యార్థులు (90.12 శాతం) ఉత్తీర్ణత సాధించారు. దే వరుప్పుల జీజేసీలో 48 మందికి 43 మంది విద్యార్థులు (89.59 శాతం), రంగశాయిపేట జీజేసీలో 69 మందికి 13 మంది (18.84) పాస్ అయ్యూరు. నర్సంపేట బాలుర జీజేసీ లో 34 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 26.47శాతం ఉత్తీర్ణత సాధించారు. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు.  6.25 శాతం ఉత్తీర్ణతతో పరకాల జీజేసీ జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది.

ఎయిడెడ్ కళాశాలల్లో 45.67 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని ఆరు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మొత్తం 58 9 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 269 మంది  (45.67శాతం) ఉత్తీర్ణత సాధించారు. వరంగల్‌లోని ఆంధ్ర బాలికల కళాశాలలో 126 మందికి 75 మంది విద్యార్థులు 59.52 శాతం ఉత్తీర్ణతతో టాప్‌గా నిలిచింది.  చివరి స్థానం లో ఎంపీ జూనియర్ కళాశాల 57 మంది విద్యార్థులకు 14 మంది 24.56 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 82.05 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని 14 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూ నియర్ కళాశాలల్లో మొత్తం 925 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరు కాగా.. 759 మంది విద్యార్థులు (82.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మడికొండ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 72 మంది విద్యార్థులకు 72 మంది (వంద శాతం) ఉత్తీర్ణత సాధించారు. పర్వతగిరిలో 75 మం దికి 75 మంది, జఫర్‌గఢ్‌లో 73 మందికి 73 మంది (వంద శాతం) ఉత్తీర్ణులయ్యూరు. నర్సంపేట టీఎస్‌డబ్లూఆర్‌జేసీలో 51 మంది విద్యార్థులకు 27 మంది ఉత్తీర్ణత సాధించారు. 52.94 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

 ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 88.24 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని నాలుగు టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ల్లో మొత్తంగా 408 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కా గా.. 360 మంది విద్యార్థులు (88.24 శాతం) ఉత్తీర్ణత సా ధించారు. వరంగల్‌లోని ఎక్స్‌లెన్స్‌లో 79 మందికి 77మంది (97.47శాతం) ఉత్తీర్ణత సాధించి టాప్‌గా నిలిచింది. కురవి టీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలికలు)లో 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 132 మంది (96.35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఏటూరునాగారం టీటీడబ్ల్యూఆర్‌జేసీలో 81 మంది విద్యార్థులకు 53 మంది (65.43 శాతం) ఉత్తీర్ణత సాధించి ఆ కళాశాలల ఫలితాల్లో చివరిస్థానంలో నిలిచింది.

మోడల్ స్కూల్ కళాశాలల్లో 69.13 శాతం ఉత్తీర్ణత

జిల్లాలో 29 మోడల్‌స్కూల్ జూనియర్ కళాశాలల్లో మొత్తం 988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా..  683 మం ది (69.13శాతం ) పాస్ అయ్యూరు.  నెల్లికుదురు మోడల్‌స్కూల్ జూనియర్ కాలేజీలో 40 మంది విద్యార్థులకు 40 మంది (100 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జఫర్‌గఢ్ మోడల్‌స్కూల్ జూనియర్ కాలేజీలో 45మందికి 43 మంది (96శాతం) ఉత్తీర్ణులయ్యూరు. నేరడ మోడల్‌స్కూల్ జూనియ ర్ కళాశాలలో 45 మందికి 42 మంది (93 శాతం)ఉత్తీర్ణత సాధించారు. జవహర్‌నగర్ మోడల్‌స్కూల్ జూనియర్ కళాశాలలో ఏడుగురు విద్యార్థులకు ఒక్కరే (14.29శాతం )ఉత్తీర్ణత సాధించగా, ఆ కళాశాల చివరిస్థానంలో నిలిచింది.
 
టీఎస్‌ఆర్ జూనియర్ కాలేజీల్లో 83.87శాతం ఉత్తీర్ణత

జిల్లాలో రెండు టీఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలుండగా 217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యూరు. ఇందులో 182 మంది  (83.87శాతం) ఉత్తీర్ణత సాధించారు. హసన్‌పర్తి టీ ఎస్‌ఆర్ కాలేజీలో 170 మందికి 168 మంది ఉత్తీర్ణుల య్యూరు. 98.82 శాతంతో ఆ కాలేజీ టాప్‌గా నిలిచింది. అశోక్‌నగర్ టీఎస్‌ఆర్ ఎస్టీ బాలుర కళాశాలలో 47 మంది విద్యార్థులకు 14 మంది (29.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement