నల్గొండ: మద్యం మత్తులో కన్న తండ్రిని సొంత కొడుకే గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. గ్రామానికి చెందిన పగిల యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. అప్పటినుంచి అతను తరచుగా తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బాగా తాగి వచ్చి తండ్రి పగిల రాములు(60)ను కాలుతో తన్నాడు.
దీంతో ఆయన మంచం మీద పడ్డాడు. ఆ సమయంలో యాదయ్య అతని గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.